ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క వాట్సాప్ మెసేజ్.. 13ఏళ్ళ బాలిక రేప్ కేసును పరిష్కరించేలా చేసింది.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి

ABN, First Publish Date - 2022-11-12T13:40:30+05:30

పోస్ట్ మార్టంలో దారుణమైన నిజాలు బయటపడ్డాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: 13 ఏళ్ళ బాలికను రేప్ చేశారు.. తదనంతరం ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు నమ్మించారు.. దాంతో కేసు మొత్తం క్లోజ్ అయిపోయింది. కానీ రెండు నెలల తరువాత ఓ వాట్సాప్ మెసేజ్ ఊహించని విధంగా నిందితుడిని జైలు గోడల మధ్య కూర్చోబెట్టింది. సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రానికి సంబంధించిన పనులలో తలమునకలై ఉండగా ఆయన వాట్సాప్‌కు స్థానికంగా పనిచేసే ఒక జర్నలిస్టు నుండి ఒక మెసేజ్ వచ్చింది. 13 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించి కేసు క్లోజ్ చేశారని, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆ తరువాత సూసైడ్ అంటూ కేసును తప్పుదోవ పట్టించారనేది ఆ మెసేజ్ సారాంశం.

అంతే.. అది చూసిన ముఖ్యమంత్రి ఆ కేసు గురించి వాకబు చేసి తిరిగి విచారణ చేపట్టాలని సీఐడీకి అప్పగించారు. ముఖ్యమంత్రి ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతదేహాన్ని బయటకు తీయించి మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించారు. అందులో దారుణమైన నిజాలు బయటపడ్డాయి.

సీఐడీ వారు తెలిపిన వివరాల ప్రకారం, అస్సాం రాష్ట్రం దర్రాంగ్ జిల్లాలో కృష్ణ కమల్ బారుహ్ అనే ఎస్ఎస్‌బీ జవాన్ ఇంట్లో 13ఏళ్ళ గిరిజన బాలిక పనిమనిషిగా పనిచేస్తుండేది. కృష్ణ కమల్ ఆ బాలికను అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక కృష్ణ కమల్‌కు ఎదురు తిరిగి ఈ విషయాన్ని మీ భార్యకు, మా అమ్మా నాన్నలకు చెప్పేస్తాను అని బెదిరించింది. ఆ బాలిక మాటలకు భయపడిన కృష్ణ కమల్ ఆమె తలపై, మెడ మీద కర్రతో కొట్టాడు. అనతరం గొంతుకోసి చంపేశాడు. ఆ తరువాత ఆ అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయినట్టు ప్రచారం చేశాడు. పోలీసు అధికారులను, డాక్టర్లను డబ్బుతో లోబరుచుకుని విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అన్ని వైపుల నుండి సమస్య లేకుండా చేసుకోవడంతో ఆ కేసు క్లోజ్ అయిపోయింది. కృష్ణ కమల్‌ కూడా అంతా అయిపోయిందిలే తనకు ఎలాంటి సమస్యలేదని రిలాక్స్ అయిపోయాడు.

కానీ, రెండు నెలల తర్వాత ఓ జర్నలిస్ట్ చేసిన వాట్సాప్ మెసేజ్ వల్ల ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది.

బాలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఆమె శరీరంపై గాయాలైన్నట్లు, దుస్తులపై వీర్యం మరకలు ఉన్నాయని తేలింది. దాంతో కృష్ణ కమల్‌కు డి.ఎన్.ఏ టెస్ట్ చేయడం ద్వారా పోలీసులు అతడిని దోషిగా తేల్చారు. హత్య జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్ అధికారిగా వేరొకరు ఉండేవారు. వారు బదిలీ మీద వేరే ప్రాంతానికి వెళ్ళడంతో కేసు విచారణను కొత్త అధికారి చేపట్టారు.

ఈ కేసులో కృష్ణ కమల్‌ని తప్పించడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులు, పోస్ట్ మార్టం నిర్వహించి తప్పుడు నివేదికలు ఇచ్చిన వైద్యాధికారులను సస్పెండ్ చేశారు. కృష్ణ కమల్ కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్ నుండి సంబంధిత అధికారులకు 2లక్షల రుపాయలు ట్రాన్స్‌ఫర్ అయినట్టు రుజువు కావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇలా ఒక జర్నలిస్ట్ పంపిన ఒకే ఒక్క మెసేజ్ సీన్‌ను రివర్స్ చేసింది.

Updated Date - 2022-11-12T13:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising