ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు బస్సులు ఎక్కట్లేదని కొత్త ప్రయోగం.. ఇలా చేస్తే 2నిమిషాల్లో ఫ్రీ టికెట్.. ఇంతకీ ఎక్కడంటే..

ABN, First Publish Date - 2022-12-14T14:39:01+05:30

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఫ్రీ బస్ టికెట్ లు వస్తున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణం చేయాలంటే డబ్బు పెట్టి టికెట్ కొనాలి. కానీ కొందరు ఆర్థిక స్థితి సరిగా లేక ప్రయాణాలు విరమించుకుంటూ ఉంటారు. అక్కడ మాత్రం అలాంటి సమస్య ఏమీ లేదట. తాము ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకుంటే ఎంచక్కా స్క్వాట్స్ తీసి ఫ్రీ బస్ టికెట్ పొందుతున్నారట. ఇంతకూ ఇదెక్కడి కొత్త నియమం? ఎందుకు పెట్టారు?? వంటి విషయాలలోకి వెళితే..

రుమేనియా లో క్లూజ్-నపోకా అనే నగరంలో 2 నిమిషాల్లో 20 స్క్వాట్స్ తీస్తే బస్ టికెట్ ప్రీ ఇస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య స్పృహ పెంచాలని అక్కడి స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా ఈ ఛాలెంజ్ ను ప్రవేశపెట్టారు. అక్కడ ఎవరైనా ప్రయాణం చెయ్యాలని అనుకున్నప్పుడు దీని కోసం ఏర్పాటు చేసిన మిషన్ దగ్గరకు వెళ్ళి 2 నిమిషాల్లో 20 స్క్వాట్ లు తీస్తారు. ఆ మిషన్ వాటిని లెక్కబెట్టుకుంటుంది. 20 సంఖ్య పూర్తికాగానే మెషిన్ కు ఉన్న స్మార్ట్ బాక్స్ లో నుండి బస్ టికెట్ బయటకు వస్తుంది.

రుమేనియాలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఇతర కారణాల వల్ల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కాసింత సంక్షోభంలో ఉందట. ప్రజలు పబ్లిక్ వాహనాలలో ప్రయాణాలు చేయడానికి అంత ఆసక్తిగా లేరట. దీని నుండి ప్రజలను బయటకు తీసుకురావడానికి, వారిని ఆరోగ్యస్పృహతో కూడిన ఈ ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుందట.

ప్రస్తుతం రుమేనియాలో చాలా మంది ఈ స్క్వాట్స్ తీసి బస్ టికెట్ తీసుకోవడాన్ని ఆస్వాదిస్తున్నారు. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావడం చాలా మంచి పరిణామం. ఈ విషయం గురించి విన్న భారతీయులు అలాంటిదేదో మనకూ పెడితే బాగుండు కదా.. చిన్నప్పటి నుండి గుంజిళ్ళు(స్క్వాట్స్ గుంజిళ్ళను పోలి ఉంటాయి) తీస్తూ పెరిగిన వాళ్ళమే కదా మనకు ఆ టాస్క్ పెద్ద కష్టం ఏమి కాదులే అంటున్నారు.

ఏది ఏమైనా బస్ టికెట్ ఫ్రీగా వస్తుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు.

Updated Date - 2022-12-14T16:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising