Pilot: తల్లి కల నెరవేర్చిన పైలెట్...మక్కాకు విమానంలో తీసుకెళ్లిన కుమారుడు
ABN, First Publish Date - 2022-12-28T06:49:34+05:30
ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ జీవితంలో విజయం సాధించాలని,తాను కన్న కలలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటారు....
మక్కా : ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ జీవితంలో విజయం సాధించాలని,తాను కన్న కలలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. వారి పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి,వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి, తల్లిదండ్రులు త్యాగాలు చేయడానికి వెనుకాడరు. నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న తల్లీ,కొడుకుల స్ఫూర్తిదాయక కథ ఒకటి సోషల్ మీడియాలో వెలుగుచూసింది.ఓ మహిళ తన చిన్న కుమారుడు పెరిగి పైలెట్ కావాలని కోరుకుంది. తన కుమారుడు నడిపించే విమానంలో తనను మక్కాకు తీసుకెళ్లాలని ఆ తల్లి కలలు కంది.(Mothers Dream) కొన్నాళ్ల తర్వాత ఆ యువకుడు తన తల్లి కలను నిజం చేశాడు.(Pilot Fulfills)
పైలెట్ అయిన అమీర్ రషీద్ వానీ అతని తల్లి సంవత్సరాల క్రితం రాసిన నోట్ ను ట్విట్టరులో(Twitter post) పంచుకున్నారు. ‘‘నేను పాఠశాలకు వెళ్లేటపుడు మా అమ్మ నాకు ఓ కార్డు రాసి దాన్ని నా మెడలో వేలాడదీసింది.నువ్వు విమాన పైలెట్ అయినపుడు నన్ను మీ విమానంలో మక్కాకు(Makkah) తీసుకువెళ్లు అని నా తల్లి చెబుతుండేది. ఈ రోజు నా తల్లిని పవిత్ర కాబా నగరమైన మక్కాకు ప్రయాణించే విమానానికి నేను పైలెట్ ను’’ అని పైలెట్ అమీర్ రషీద్ ట్వీట్ చేశారు.(Mecca On His Plane)
ఈ ట్వీట్ 20,000 కంటే ఎక్కువ లైక్‌లను, 2,300 కంటే ఎక్కువ రీట్వీట్‌లను పొందింది. సోషల్ మీడియా యూజర్లు స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను ఇష్టపడ్డారు. తన తల్లి కలను నెరవేర్చినందుకు పైలట్‌పై నెటిజన్లు ప్రేమ కురిపించారు. ‘‘విశ్వాసం శక్తివంతమైనది, తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా అంతే శక్తివంతమైనది’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.‘‘మీరు దృఢ సంకల్పంతో ఉంటే మీ కలలు నెరవేరుతాయి’’ అని మరో నెటిజన్ రాశారు. ‘‘మీరు మీ తల్లి కలను నెరవేర్చినందుకు మీరు నిజంగా అదృష్టవంతులు’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-01-28T00:10:54+05:30 IST