ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Liger Controversy: విజయ్ కి కూడా పూర్తిగా డబులివ్వని పూరి జగన్

ABN, First Publish Date - 2022-12-10T13:01:21+05:30

పూరి మరియు ఛార్మి లకు ఈ సినిమా నిర్మాతలుగా లాభాలు తప్పితే నష్టాలు ఏమి లేవు. కానీ పూరి జగన్ విజయ్ దేవరకొండకి ఇవ్వాల్సిన పారితోషికం కూడా పూర్తిగా ఇవ్వలేదని తెలిసింది.

A still from Liger
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకుడు పూరి జగన్నాధ్ (Puri Jagannath) దర్శకత్వం వహించి, నిర్మించిన 'లైగర్' సినిమా ఒక పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. (Liger film) ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే లు (Vijay Deverakonda, Ananya Pandey) లీడ్ పెయిర్ గా నటించారు. ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుండి చాల వివాదాల్లో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోయారు, అందుకు కొంత చెల్లిస్తే బాగుంటుంది అని దర్శకుడు, నిర్మాత అయిన పూరి, అతని స్నేహితురాలి ఛార్మి ని అడిగితే వాళ్ళు నయాపైసా కూడా ఎవరికీ ఇవ్వలేదు అని తెలిసింది. దాని మీద కొంతమంది పూరి ఇంటికి రావటం, పూరి వాళ్ళమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ అప్పట్లో పెద్ద వార్తలుగా వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే.

కానీ విషయం ఏంటి అంటే, పూరి మరియు ఛార్మి లకు ఈ సినిమా నిర్మాతలుగా లాభాలు తప్పితే నష్టాలు ఏమి లేవు. ఎందుకంటే ఈ సినిమాకి ఓ.టి.టి మరియు శాటిలైట్ హక్కులు పెద్ద మొత్తం లో వచ్చాయి వీళ్ళకి. ఇదిలా ఉంటే, పూరి జగన్ విజయ్ దేవరకొండకి ఇవ్వాల్సిన పారితోషికం కూడా పూర్తిగా ఇవ్వలేదని తెలిసింది. ఆమధ్య విజయ్ రెండు సార్లు ముంబై వెళ్లి పూరి జగన్, ఛార్మీలను కలిసి తన పారితోషికం గురించి అడగ్గా, తాము చాలా నష్టాల్లో ఉన్నామని, ఇవ్వలేమని చెప్పేరు అని తెలిసింది. ఎవరికీ వాపసు డబ్బులు ఇవ్వకుండా, మరీ ఈ రెండు హక్కుల ద్వారా వచ్చిన డబ్బులు ఏమి చేసినట్టు? ఎక్కడికి పోయినట్టు? అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. విజయ్ కి ఇస్తామన్న పారితోషికం కూడా ఇవ్వలేదు, సినిమా కూడా చుట్టేశారు, మరి అందరికి మా దగ్గర డబ్బులు లేవు అని ఎలా చెప్తున్నారు అని టాక్ నడుస్తోంది . విజయ్ కి సగానికి పైగా పారితోషికం రావాల్సి ఉందని అంటున్నారు. అందువల్లే పూరి, చార్మీలు ముంబై వదిలి హైదరాబాద్ రావటం లేదు అన్న విషయం పరిశ్రమలో టాక్ నడుస్తోంది. (Vijay Deverakonda Remuneration)

Updated Date - 2022-12-10T13:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising