Rana-Miheeka: మాస్టారూ.. రానా కూతురు కాదు.. మిహీకా మేనకోడలు!

ABN, First Publish Date - 2022-11-05T11:23:55+05:30

రీసెంట్‌గా రానా దగ్గుబాటి (Rana Daggubati), మిహీకా బజాజ్ (miheeka bajaj) దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదే వార్తను..

Rana-Miheeka: మాస్టారూ.. రానా కూతురు కాదు.. మిహీకా మేనకోడలు!
miheeka bajaj insta pic
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రీసెంట్‌గా రానా దగ్గుబాటి (Rana Daggubati), మిహీకా బజాజ్ (miheeka bajaj) దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదే వార్తను ఓ నెటిజన్ మిహీకాను అడుగగా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. ప్రస్తుతం వివాహబంధంతో హ్యాపీగా ఉన్నాం. ఈ హెల్దీ వాతావరణాన్ని ఇలా ఉండనీయండి.. లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయవద్దు.. అంటూ మిహీకా ఆ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిచ్చింది. తాజాగా మిహీకా ఓ పాపని ఎత్తుకుని ఉన్న ఫొటోని సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో రానా, మిహీకాలకు పాప పుట్టింది అంటూ.. ఆ దంపతులకి కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పడం మొదలెట్టారు. అరె.. నిన్నకాక మొన్న అలాంటిదేమీ లేదని క్లియర్‌గా మిహీకా చెప్పినా.. చేతిలో పాపని చూడగానే.. వారికే పుట్టిందనుకుని అంతా కంగ్రాట్స్ చెబుతుండటం విశేషం. అయితే దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవల నయనతార పిల్లలు కావాలని అనుకుంటుందనే వార్త వచ్చిన మరుసటి రోజే.. ఆమెకు కవల పిల్లలు అనే న్యూస్ వచ్చింది. అంతా షాకయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

సేమ్ టు సేమ్.. ఇప్పుడు మిహీకా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని.. కొందరు నెటిజన్లు పొరబడుతున్నారు. అయితే మిహీకా మాత్రం.. క్లియర్‌గా తన పోస్ట్‌లో మెన్షన్ చేసింది. ఏమని అంటే.. ‘నా అందమైన మేనకోడలు (niece), ఏంజెల్‌తో మొట్టమొదటి ఫొటో.. ప్రేమతో మిహీకా బజాజ్’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. కాకపోతే ఈ పిక్‌లో ఆమె కన్నతల్లిలా పాపని ఒడిలో లాలిస్తుండటంతో.. అంతా ఆ పాప మిహీకాకు జన్మించిన పాపగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కన్ఫ్యూజ్ అయిన వారందరికీ.. ‘మాస్టారూ.. ఆ పాప రానా కుమార్తె కాదు.. మిహీకా మేనకోడలు’ అంటూ రానా ఫ్యాన్స్ తెలియజేస్తుండటం గమనార్హం. (miheeka bajaj insta pic goes viral)

Updated Date - 2022-11-05T11:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising