Samantha: ఇక మా చేతుల్లో ఏం లేదంటూ.. సమంత పెట్టిన పిక్ వైరల్!
ABN, First Publish Date - 2022-11-10T12:22:12+05:30
సమంత ‘యశోద’ (Samantha Yashoda) ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. సమంత మయోసైటిస్ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. తన సినిమా ప్రచారం కోసం ధైర్యంగా ముందుకు వచ్చి..
సమంత ‘యశోద’ (Samantha Yashoda) ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. సమంత మయోసైటిస్ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. తన సినిమా ప్రచారం కోసం ధైర్యంగా ముందుకు వచ్చి.. ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తను ఎంత బాధపడిందో కూడా చెప్పింది.. అయినా మళ్ళీ స్ట్రాంగ్‌గా వస్తాను అని కూడా చెప్పింది. అంతకుముందు.. ప్రమోషన్స్ కోసం వస్తున్నా అంటూ.. రెండు ఫోటోస్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతవరకు బాగానే వుంది కానీ తాజాగా.. ‘యశోద’ సినిమాకు సంబంధించి ఇంక మా చేతుల్లో ఏం లేదంటూ.. ఇంకో ఫొటో పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో ఆమెని చూసిన వారంతా.. అయ్యో! పాపం సమంత ఏంటి ఇలా అయిపోయిందని ఆశ్చర్యపోతున్నారు. అయినా.. సినిమా కోసమే కదా ఆమె ఇంత కష్టపడుతోందని అందరూ ఆమెని ఓదారుస్తున్నారు. ఏమీ కాదు మళ్ళీ మామూలు మనిషివి అవుతావని ధైర్యం చెబుతున్నారు. (Samantha pic goes viral)
ఇక ఈ పిక్‌లో ఆమె సమంతలా కూడా అస్సలు కనిపించటం లేదు, అంతలా మారిపోయింది. ఆమె చేతులు, వేళ్ళు, ఆ ముడతలు చూసి పాపం సమంత ఏంటి ఇంత నీరసంగా అయిపోయింది, చర్మం రంగు కూడా మారిపోతోంది.. అని తెగ బాధపడిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె నేను చావలేదు, చచ్చిపోను అని కూడా చెప్పి అందరికీ ఒక స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చింది. ఆమెని ఇలా చూసిన అభిమానులు అయితే.. అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చి.. త్వరగా కోలుకుని ఎప్పటిలానే ఆమె సినిమాలు చేయాలని.. ప్రార్థనలు చేస్తున్నట్లుగా వారు రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ పిక్‌తో పాటు.. మీ అందరికీ ‘యశోద’ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా నెర్వస్‌గా వుంది కానీ ఎగ్జయిటింగ్‌గా వుంది. ఇంకా మా చేతుల్లో ఏం లేదు.. మీ తీర్పు కోసం నేను, చిత్రయూనిట్ అంతా వేచి చూస్తున్నాం.. అని సమంత ట్వీట్ చేసింది. (Yashoda Movie)
Updated Date - 2022-11-10T12:25:34+05:30 IST