40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Sania Mirza: సానియా మీర్జా విడాకులు తీసుకోనుందా.. ఎందుకీ వార్తలొచ్చాయంటే..

ABN, First Publish Date - 2022-11-07T22:14:43+05:30

ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (shoaib malik and sania mirza news) విడాకులు తీసుకోనున్నారన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (shoaib malik and sania mirza news) విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు ఇంటర్నెట్‌లో పెను దుమారం రేపుతున్నాయి. "Where do broken hearts go. To find Allah" అని తన ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో సానియా మీర్జా (sania mirza news) పెట్టిన పోస్టే అందుకు కారణం. అంటే.. ‘ముక్కలయిన హృదయం ఎక్కడకు వెళుతుంది. అల్లాను అన్వేషిస్తుంది’ అని ఇన్‌స్టాగ్రాంలో సానియా మీర్జా పెట్టిన పోస్ట్ (Sania Mirza Instagram Post) విడాకుల ప్రచారానికి తావిచ్చింది.

ఈ పోస్ట్ చూడగానే.. సానియా మీర్జాకు, షోయబ్ మాలిక్‌కు మధ్య మనస్పర్థలొచ్చాయని.. ఆ నిర్వేదంతోనే సానియా మీర్జా విడాకుల నిర్ణయానికొచ్చి పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టిందని ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవలే.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి తమ కొడుకు ఇజ్హాన్ పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో ఘనంగా జరిపారు. అయితే.. ఆ తర్వాత షోయబ్ మాలిక్ సానియాను మోసం చేశాడనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో గుప్పుమన్నాయి. షోయబ్ ఓ షో షూటింగ్‌లో ఉండగా ఈ వార్తలు దావానలంలా వ్యాపించాయి.

sania-post.jpg

తాజాగా.. సానియా పెట్టిన పోస్ట్‌తో ఇద్దరి మధ్య సఖ్యత లేదని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్టయింది. ఈ ప్రచారాన్ని సానియా గానీ, షోయబ్ మాలిక్ గానీ ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. విడాకులు తీసుకుంటున్నట్టు కూడా ఇద్దరిలో ఏ ఒక్కరూ ప్రకటించలేదు. కానీ.. తాజాగా సానియా మీర్జా విడాకులు తీసుకోనుందన్న వార్తలు వైరల్‌గా మారాయి.

సానియా మీర్జాకు, షోయబ్ మాలిక్‌కు వివాహం జరిగి ఇప్పటికి 12 సంవత్సరాలయింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సానియా మీర్జా ఒక పాకిస్థాన్ యువకుడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆమె పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆమెపై కొందరు దుమ్మెత్తిపోశారు. ‘భారత్‌లో వరుడే దొరకలేదా’ ? అని వెటకారం చేసిన వాళ్లూ ఉన్నారు. అప్పుడు సానియా మీర్జా పెళ్లిని వ్యతిరేకించిన వాళ్లంతా ఇప్పుడు సోషల్ మీడియా‌లో ఈ ఊహాగానాలకు మరింత మసాలా దట్టించి ప్రచారం చేస్తున్నారు.

Updated Date - 2022-11-07T22:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!