అంతా చూస్తుండగా... గుర్రంపై వరుడు పరార్.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN, First Publish Date - 2022-05-15T02:59:54+05:30
కొన్నిసార్లు వివాహ కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని అయ్యో పాపం అనేలా ఉంటే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ....
కొన్నిసార్లు వివాహ కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని అయ్యో పాపం అనేలా ఉంటే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ఇలాంటి వీడియోలు నిత్యం కోకొళ్లలు దర్శనమిస్తుంటాయి. ఈ తరహాలు వీడియోలలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వివాహ కార్యక్రమంలో అంతా చూస్తుండగా.. వరుడు గుర్రంపై పరారవుతాడు. అయితే అసలు కారణం తెలుసుకుని.. నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వివాహ కార్యక్రమంలో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. గుర్రంపై వచ్చిన వరుడికి వధువు తరపు వారు ఘన స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా వారి సంప్రదాయం ప్రకారం హారతులు పడతారు. మరోవైపు చాలా మంది యువకులు.. కేకలు, ఈలలు వేస్తుంటారు. అదే సమయంలో కొందరు యువకులు టపాసులు పేల్చడంతో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఆ శబ్ధానికి గుర్రం బెదిరిపోయి అక్కడి నుంచి పరుగందుకుంటుంది. వరుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం ఉండదు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. వెంటనే తేరుకుని గుర్రాన్ని ఆపేందుకు.. దాని వెంట పరుగులు పెడతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి.