ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sania Mirza: సానియా కాపురంలో చిచ్చు పెట్టింది ఈమేనంటున్న సోషల్ మీడియా.. ఇంతకీ ఈమె ఎవరంటే..

ABN, First Publish Date - 2022-11-12T17:31:28+05:30

గత రెండు, మూడు రోజులుగా అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు (sania mirza and shoaib malik news) తీసుకోనున్నారన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత రెండు, మూడు రోజులుగా అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు (sania mirza and shoaib malik news) తీసుకోనున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను ఈ దంపతులు ఖండించలేదు అలా అని విడాకులు తీసుకుంటున్నట్లు నిర్ధారించలేదు. దీంతో.. వీరి విడాకుల వార్తలు (sania mirza divorce news) మరింత జోరుగా సరికొత్త ఊహాగానాల రంగు పులుముకుని సోషల్ మీడియాలో, మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా.. సానియా, షోయబ్ (Sania Shoaib Malik) మధ్య మనస్పర్థలకు కారణం ఒక పాకిస్థాన్ నటి అని ప్రచారం జరుగుతోంది.

ఆ నటి పేరు ఆయేషా ఒమర్ (Ayesha Omar). షోయబ్ మాలిక్, ఆయేషా ఒమర్ (Shoaib Malik Ayesh Omar) కలిసి దాదాపు సంవత్సరం క్రితం ఒక Bold Photoshoot చేశారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్‌గా మారాయి. షోయబ్ మాలిక్, ఆయేషా మధ్య చనువు పెరగడమే సానియాతో విడాకులు వరకూ షోయబ్ వెళ్లేందుకు కారణమైందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ పాకిస్థాన్ నటి ఆయేషా ఒమర్ గురించి ఆరా తీయగా షోయబ్ మాలిక్‌తో కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉందన్న ప్రచారం పాకిస్థాన్ మీడియాలో కూడా జోరుగా సాగింది.

Samui vacation లో ఈ అమ్మడు ఉన్న సమయంలో ఆమె ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. ఆ ఫొటోలపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే.. తాను ట్రోల్స్‌ను పట్టించుకోనని అప్పట్లోనే ఆయేషా ఒమర్ కరాఖండిగా చెప్పేసింది. 2020లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల బారిన పడిన వారిలో తాను కూడా ఒకరినని భావోద్వేగానికి గురైంది. తాను ఎంచుకున్న రంగంలో, జీవితంలో ఎన్నో వేధింపులకు గురయ్యానని.. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలనని Bol Nights with Ahsan Khan టాక్ షోలో ఆయేషా చెప్పింది. ఆ లైంగిక వేధింపులకు గురిచేసిన వాళ్లు ఎవరో చెప్పే ధైర్యం ఇప్పుడు లేదని, ఏదో ఒక రోజు తాను బయటపెడతానని అప్పట్లో ఆమె చెప్పుకొచ్చింది. మరో వివాదంతో కూడా అప్పట్లో ఆయేషా ఒమర్ వార్తల్లో నిలిచింది.

ఒక ఫ్రెండ్ పెళ్లిలో ఆయేషా డ్యాన్స్ చేసిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయేషాను చూసిన నెటిజన్లు భగ్గుమన్నారు. అందుకు కారణం ఆమె ధరించిన Black Lehenga, Sleeveless Choli. ఈ డ్రెస్‌లో ఆమె హాట్ బాంబ్ మలైకా అరోరా ఫేమస్ ఐటమ్ సాంగ్ ‘మున్నీ బదనాం’ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. అయితే.. ఆయేషా ధరించిన డ్రస్ కారణంగా ట్రోల్స్‌కు గురయింది. ఈ ఆయేషానే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య చిచ్చు పెట్టిందని ఇప్పుడు కూడా ఆమెను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఈ విడాకుల ప్రచారంపై సానియా గానీ, షోయబ్ మాలిక్ గానీ స్పందించనంత వరకూ ఇలాంటి ప్రచారాలకు, వార్తలకూ అడ్డుకట్ట పడేలా లేదు.

Updated Date - 2022-11-12T17:38:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising