ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yashoda - Sivalenka Krishna prasad: ఎక్స్‌పెరిమెంట్‌ కాదు.. ఎగ్జైట్‌మెంట్‌తో తీశా!

ABN, First Publish Date - 2022-11-06T19:37:52+05:30

‘‘సినిమా షూటింగ్‌ పూర్తై, డబ్బింగ్‌ టైమ్‌లో మాకు సమంత హెల్త్‌ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్‌ చెప్పారు. తమిళంలో చెప్పే సమయానికి ఆమె ఎనర్జీ లెవల్స్‌ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దాం అన్నాను అందుకు ఆఎ అంగీకరించలేదు. మూడు, నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్‌ చెప్పారు. ఆవిడ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌’’ అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘సినిమా షూటింగ్‌ పూర్తై, డబ్బింగ్‌ టైమ్‌లో మాకు సమంత(Samantha) హెల్త్‌ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్‌ చెప్పారు. తమిళంలో చెప్పే  సమయానికి ఆమె ఎనర్జీ లెవల్స్‌ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దాం అన్నాను అందుకు సమంత  అంగీకరించలేదు. మూడు, నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్‌ చెప్పారు. ఆవిడ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌’’ అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ (Krishna prasad sivalenka)అన్నారు. సమంత టైటిల్‌లో ఆయన నిర్మించిన చిత్రం ‘యశోద’(Yashoda). హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 11న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు. 

‘సమ్మోహనం’ తర్వాత నేను నిర్మించిన డైరెక్ట్‌ సినిమా ‘యశోద’. తమిళ నిర్మాతలు చేయాల్సిన సినిమా ఇది. ఓసారి మా ఎగ్జిక్యూటివ్‌  ఫోన్‌ చేశాడు. ‘ఆ నిర్మాత కరోనా తర్వాత చేద్దామంటున్నారట! మీకు చేేస ఉద్దేశం ఉందా?’ అని అడిగారు. అక్టోబర్‌లో మరోసారి కథ విన్నా. బడ్జెట్‌ ఎంతా అనడిగితే మూడు, నాలుగు కోట్లు అన్నారు. షాక్‌ అయ్యా.  శంకర్‌ సినిమా తరహాలో పెద్ద పాయింట్‌ ఉంది. తక్కువలో ఎందుకు చేస్తున్నారని అడిగా. తాము కొత్త దర్శకులం కాబట్టి అంత బడ్జెట్‌ ఎవరిస్తారని అన్నారు. మళ్ళీ కథపై రీ వర్క్‌ చేశారు. ఏడెనిమిది  నెలల తర్వాత స్ర్కిప్ట్‌ సంతృప్తికరంగా వచ్చింది. ఆ టైమ్‌లో ‘పుష్ప’, ‘కెజిఎఫ్‌’ సినిమాలు డబ్బింగ్‌ జరుగుతోంది. మనం కూడా పాన్‌ ఇండియా చేేస్త బావుంటుందని అనుకున్నాం. టైటిల్‌ పాత్ర చేయడానికి తగ్గ కథానాయిక ఎవరని చూేస్త సమంత ఆలోచన వచ్చింది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో ఆవిడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.  గత ఏడాది సెప్టెంబర్‌ 8న సమంత కథ విని చేస్తానన్నారు. మరో కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తీసుకున్నాం. సమంత స్ర్కిప్ట్‌ విన్నప్పటి నుంచి ‘యశోద’తో సమంత ట్రావెల్‌ చేశారు. ‘శాకుంతలం’ పూర్తి కావడంతో ఫోకస్‌ మొత్తం ఈ సినిమాపై పెట్టారు. సరోగసీ నేపథంలో జరుగుతున్న క్రైమ్‌ను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. 

ఆ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌..

అయితే ఇప్పుడు సమంత ఆరోగ్యం బాగోలేదు. సినిమా షూటింగ్‌ పూర్తై, డబ్బింగ్‌ టైమ్‌లో మాకు సమంత హెల్త్‌ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్‌ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్‌ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. తమిళంలో తన వాయిస్‌ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. హిందీలో చిన్మయి చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్‌ చెప్పారు. ఆవిడ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందు మాకు ఆమె ఆరోగ్యం గురించి  తెలిసింది.  

ప్రయోగం కాదు...

ఇది ప్రయోగాత్మక చిత్రం కాదు. ఎక్స్‌పెరిమెంట్‌ అనుకుని చేయలేదు. ఎగ్జైట్‌మెంట్‌తో ‘యశోద’ చేశా. ‘నువ్వు ‘ఆదిత్య 369’ చెయ్యవయ్యా. నిన్ను 30 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారు’ అని ఎస్‌.పి.బాలు అంకుల్‌ చెప్పారు. టైమ్‌ ట్రావెల్‌ విని ఎగ్జైట్‌ అయ్యా. ఇప్పుడు కూడా కథ విని అలాగే చేశా. సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారు. నమ్మకం ఉంది.. ఫస్ట్‌ టైమ్‌ విడుదలకు ముందు నాకు ఈ సినిమా కంఫర్ట్‌ లెవల్‌లోకి వచ్చింది. రిలీజ్‌ తర్వాత కూడా కంఫర్టబుల్‌గా ఉంటాను. 

మాటలు అద్భుతం..

దర్శకులు హరి, హరీష్‌ ఇద్దరికీ తెలుగు రాదు. అందుకని, తెలుగులో మాటలు రాయడానికి సీనియర్‌ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ అయితే బావుంటుందని వాళ్ళకు పరిచయం చేశా. నాకు పదిహేనేళ్ళుగా చిన్నారాయణ పరిచయం. సినిమాలపై మంచి పుస్తకాలు రాశాడు . కథానుగుణంగా ఇద్దరూ చక్కటి అద్భుతమైన మాటలు రాశారు. దర్శకులకు వాళ్ల వర్క్‌ బాగా నచ్చింది.


మళ్లీ భయం మొదలైంది...

ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మారుతుంటుంది... దాన్ని లేటెస్ట్‌ అంటాం. ఐదారు నెలలుగా మళ్లీ భయం మొదలైంది. ఇప్పుడు నిర్మాత భయపడాలి. ఎందుకంటే... కరోనా తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. ఓటీటీల్లో సబ్‌ టైటిల్స్‌ ఉంటున్నాయి. వరల్డ్‌ సినిమా చూస్తున్నారు. అందుకని, ఏమాత్రం రొటీన్‌కి దగ్గరగా ఉన్నా నిర్థాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్‌ షో కలెక్షన్స్‌ మీద ఎఫెక్ట్‌ చూపిస్తోంది. ప్రేక్షకులు ని తోక్కేస్తున్నారు. కాంబినేషన్స్‌ మీద కాకుండా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలు కాన్సంట్రేషన్‌ చేస్తున్నారు.

మా అబ్బాయికి ఇటు వద్దని చెప్పా...

మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడు సినిమాల్లోకి రాడు. కానీ, సినిమా అంటే మహా పిచ్చి. వంద డాలర్లు పెట్టి బ్లాక్‌లో సినిమా చూస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెల్లవారు జామున మూడు, నాలుగు వేలు పెట్టి టికెట్‌ కొని బెనిఫిట్‌ షోస్‌ చూేసవాడు. టికెట్స్‌ కొనడానికి ఎంతైనా ఖర్చు పెట్టు గానీ సినిమాల్లోకి రావద్దని చెప్పాను. నేను పరిశ్రమలో ఎత్తు పల్లాలు చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. ఇక మా అమ్మాయి విద్య డిజిటల్‌లో వర్క్‌ చేస్తోంది. ఇప్పుడు తనది స్పాటిఫైలో ఉద్యోగం. ‘సమ్మోహనం’, ‘జెంటిల్‌ మన్‌’ సినిమాలకు హెల్ప్‌ చేసింది. ఈ సినిమాకూ అంతే! వద్దని చెప్పింది మా అబ్బాయికి మాత్రమే. అమ్మాయితో ‘నీ ఇష్టం’ అని చెప్పాను. ‘నాకు ఎంత వరకు చేయాలో తెలుసు నాన్నా’ అంది. ఉన్నంతలో మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. మంచి సినిమాలు తీసి రిటైర్‌ అవ్వాలనుంది. 

బ్రహ్మాండం అన్నారు..

బాలకృష్ణగారితో మంచి రిలేషన్‌ ఉంది. ఈ మధ్య కలిశా. ‘యశోద’ ఏ తరహా సినిమా అని అడిగారు. కొత్త కాన్సెప్ట్‌ అని చెప్పా. మీరు చేేస్త బ్రహ్మాండం అన్నారు. ఇప్పుడు కూడా సినిమా గురించి డిస్కషన్స్‌ వస్తాయి. ఆయన ఇమేజ్‌, నా అభిరుచికి తగ్గ కథ ఎవరైనా తీసుకొస్తే ఆయనతో సినిమా చేయాలని నాకూ ఉంది. 

Updated Date - 2022-11-06T19:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising