ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లిపై స్పందించిన హీరో

ABN, First Publish Date - 2022-11-21T15:52:32+05:30

అతియా, ఇండియన్ క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లిపై అతియా తండ్రి సునీల్ శెట్టి స్పందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). ‘హీరో’ సినిమాతో వెండితెరపైకి రంగప్రవేశం చేసింది. అనంతరం కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అతియా, ఇండియన్ క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లిపై అతియా తండ్రి సునీల్ శెట్టి స్పందించాడు.

సునీల్ శెట్టి తాజాగా ‘ధారావి బ్యాంక్’ (Dharavi Bank) వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ షో ప్రమోషన్స్‌లో భాగంగా సునీల్ మీడియాతో ముచ్చటించాడు. అతియా పెళ్లిపై స్పందించాడు. ‘‘ఆమె పెళ్లి త్వరలోనే జరుగుతుంది. 3నెలల్లో మిమ్మల్ని వివాహానికి ఆహ్వానిస్తాననుకుంటున్నాను’’ అని సునీల్ తెలిపాడు. అతియా, కేఎల్‌ రాహుల్‌‌ల పెళ్లి ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, సునీల్ నివాసం ‘జహాన్’ లో‌నే ఈ జంట ఏడడుగులు వేయనున్నారని తెలుస్తోంది. కొన్ని రొజుల క్రితం ఓ వెడ్డింగ్ ఆర్గనైజర్ సునీల్ నివాసంలో కనిపించడంతో ఆ వదంతులకు మరింత బలం చేకూరింది. అంతకు ముందు సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ‘ధారావి బ్యాంక్’ లో నటించడం సంతోషంగా ఉందని తెలిపాడు. ‘‘కమల్ హాసన్, వినోద్ ఖాన్నాలకు నేను పెద్ద అభిమానిని. నటులుగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వపరంగా వారిద్దరు అంటే నాకు ఇష్టం. వారి నటనలో 10శాతం మించి నేను చేసినా పాత్రకు న్యాయం చేసినట్టే’’ అని సునీల్ శెట్టి చెప్పాడు.

Updated Date - 2022-11-21T15:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising