18 Pages: నిఖిల్ హీరోయిన్‌ని ‘టైం ఇవ్వు పిల్ల’ అంటోన్న స్టార్ హీరో

ABN, First Publish Date - 2022-11-26T12:46:37+05:30

‘18పేజెస్’ సినిమాకు సంబంధించి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేయగా.. ఆ పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ని

18 Pages: నిఖిల్ హీరోయిన్‌ని ‘టైం ఇవ్వు పిల్ల’ అంటోన్న స్టార్ హీరో
18 Pages Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ్ స్టార్ హీరో శింబు (Simbu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘వల్లభ, మన్మథ’ వంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శింబులో.. నటుడే కాకుండా మంచి సింగర్ కూడా ఉన్నాడనే విషయం తెలియంది కాదు. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ (NTR)తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో కోసం పాట పాడనున్నాడు శింబు. యూత్ ఫుల్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులని అలరించిన శింబు.. అవకాశం దొరికిన ప్రతీసారి గాయకుడిగా తన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇప్పుడు ‘కార్తికేయ2’ (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ (Nikhil) చేస్తున్న ‘18పేజెస్’ (18 Pages) చిత్రంలోని ఓ పాటకి తన గాత్రం అందించబోతున్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ సినిమాకు కథను అందించగా.. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ (Kumar 21 F) చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి (Palnati Surya Prathap) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ మంచి స్పందన రాబట్టుకుని.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

Simbu-song.jpg

తాజాగా ‘18పేజెస్’ సినిమాకు సంబంధించి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేయగా.. ఆ పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వెల్లడించారు. తమిళ స్టార్ హీరో శింబుతో ఈ చిత్రంలో పాట పాడించబోతున్నారనేదే అప్‌డేట్. శింబు ఇంతకు ముందు ఎన్టీఆర్ ‘బాద్‌షా’ సినిమాలో.. ‘డైమండ్ గర్ల్’.. మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాలో ‘బుజ్జి పిల్ల’.. రీసెంట్‌గా యంగ్ హీరో రామ్ పోతినేని ‘ది వారియర్’ సినిమాలో ‘బుల్లెట్ సాంగ్’ను పాడారు. ఇప్పుడు నిఖిల్ ‘18పేజెస్’ సినిమా కోసం ‘టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు’ అనే పాటను పాడబోతున్నారు. కాగా, క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారిక ప్రకటన చేసారు. (Star Hero Simbu sung a ecstatic number in Nikhil’s 18 Pages)

Updated Date - 2022-11-26T12:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising