ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడికి వెళ్ళి నివాసం ఉంటే 25లక్షలు ఇస్తారట.. ఇంతకీ ఎక్కడంటే..

ABN, First Publish Date - 2022-11-22T11:32:09+05:30

మకంటూ ఓ సొంత ఇల్లు ఉంటే ఎంతో నిశ్చింతగా ఉండచ్చని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకోసమే ఇప్పుడొక బంపర్ ఆఫర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంతిల్లు అందరి కల... తమకంటూ ఓ సొంత ఇల్లు ఉంటే ఎంతో నిశ్చింతగా ఉండచ్చని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకోసమే ఇప్పుడొక బంపర్ ఆఫర్.. ఇంటి కోసం డబ్బులిస్తాం ఇక్కడికొచ్చి ఉండండంటూ ప్రజలను ఆహ్వానిస్తోంది. ఇంతకూ ఎక్కడ నుండి ఈ ఆహ్వానం అనే విషయంలోకి వెళితే...

కొన్ని ప్రాంతాలు కాలంతో పాటు అభివృద్ది చెందితే.. మరికొన్ని మరుగున పడిపోతాయి. అలా ఇటలీ దేశంలో పాడుబడిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయట. అలాంటి ప్రాంతాలను తిరిగి ఫామ్ లోకి తీసుకురావడానికి ఇటలీ ప్రభుత్వం కొత్త కొత్త పద్దతులు ఫాలో అవుతోంది. పర్యాటకులను, స్థానికంగా నివసించేవారిని అక్కడికి ఆహ్వానించి ఆ ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాటిలో భాగంగా ఇప్పుడు ఓ చిన్నపాటి పట్టణాన్ని అభివృద్ది చేసే పనిలో ఉంది ఇటలీ..

ఇటలీలో పుగ్లియా అనే పేరు కలిగిన ఓ ప్రాంతం ఉంది. అక్కడికి వెళితే ఒక ఖాళీ ఇల్లు కొనుక్కుని అక్కడే నివాసం ఉండేందుకు డబ్బులిస్తామని వారు చెబుతున్నారు. సదరు పుగ్లియా ప్రాంతం ఎంతో అందంగా ఉంటుందట. బీచ్ కు దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతానికి పర్యాటకులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయట. అయితే పుగ్లియా పట్టణంలో ప్రజలు లేకపోవడంతో ఆ ప్రాంతం కళ తప్పిందని, అందుకోసమే ఈ ఆహ్వానమని అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఉండటానికి అక్షరాలా 30వేల యూరోలు అంటే.. భారతీయ కరెన్సీలో 25లక్షల రుపాయలు ఇస్తారట. ఇంకా అక్కడ ఆల్రెడీ అమ్మకానికి పెట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే 25వేల యూరోలు సరిపోతాయట.

ఈ ప్రాంతం చాలా అందమైనదని అయినా మరుగున పడటం వల్ల గుర్తింపుకు నోచుకోలేదు. అందుకే దానికి కొత్త శోభను తీసుకుని రావడానికి ప్రజలను ఇలా ఆకర్షిస్తోంది ఇటలీ. ఇక్కడ పర్యాటకం అభివృద్ది చెందితే ఇటలీ ఆర్థికంగా కొంచెమైనా ఎదుగుతుందనేది వారి ఆలోచన. మరి ఎవరికైనా బీచ్ కు దగ్గరలో ఇల్లు కావాలంటే ఇటలీ టికెట్టు కొనేయండి.

Updated Date - 2022-11-22T11:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising