ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చేతిలో పసిబిడ్డతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుందో అమ్మాయి.. మైనర్ అయిన ఆమె చెప్పింది విన్న పోలీసులకు..

ABN, First Publish Date - 2022-05-14T03:07:32+05:30

కొన్ని ప్రేమ కథల్లో సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్ని ప్రేమ కథల్లో సినిమాల్లో కూడా చూపించని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకోవడం.. అప్పుడప్పుడూ...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కొన్ని ప్రేమ కథల్లో సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్ని ప్రేమ కథల్లో సినిమాల్లో కూడా చూపించని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకోవడం.. అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ కూడా ఈ కోవకే చెందుతుంది. చేతిలో పసి బిడ్డను ఎత్తుకుని ఓ బాలిక.. పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె చెప్పింది విని పోలీసులు అవాక్కయ్యారు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్‌ పరిధికి చెందిన ఓ బాలిక, యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏడాది క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కిడ్నాప్ కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో యువకుడి మేనమామను స్టేషన్‌కు తరలించారు. వారం క్రితం ఈ విషయం తెలుసుకున్న యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో తన ప్రియుడి మేనమామను రక్షించేందుకు బాలిక.. పసిబిడ్డతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

పెళ్లి వేడుకలో మహిళతో డాన్స్ చేస్తున్నాడో వ్యక్తి.. వారిద్దరి మధ్యలో ఓ కుర్రాడి ఎంట్రీ.. చివరకు..


ఆమెను చూడగానే పోలీసులు అవాక్కయ్యారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని బాలిక తెలిపింది. తన తల్లిదండ్రులు కావాలనే తన భర్త కుటుంబ సభ్యులపై కేసులు పెట్టారని వివరించింది. భర్త, కూతరుతో కలిసి రాజస్థాన్‌లో ఉంటున్నట్లు చెప్పింది. తన భర్త పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపింది. బాలిక తెలిపిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేయసిని కలిసేందుకు వెళ్తే.. దగ్గరుండి మరీ పెళ్లి చేసి పంపించిన గ్రామస్తులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!