Samantha Health: సమంత పరిస్థితి విషమం అంటూ వార్తలు.. మొత్తానికి అసలు నిజం బయటపడింది..
ABN, First Publish Date - 2022-11-30T14:44:20+05:30
సినీ నటి సమంత ‘మయోసిటిస్’(Myositis) అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తాజాగా పుకార్లు గుప్పుమన్నాయి. సమంత (Samantha Health) గురించి అభిమానులు..
సినీ నటి సమంత (Samantha) ‘మయోసిటిస్’(Myositis) అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తాజాగా పుకార్లు గుప్పుమన్నాయి. సమంత (Samantha Health) గురించి అభిమానులు టెన్షన్ పడుతున్నారని, ఆమె చికిత్స నిమిత్తం దక్షిణ కొరియా వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. ఇవన్నీ పుకార్లేనని ఆమె వ్యక్తిగత టీం కొట్టిపారేసింది. సమంత ఆరోగ్యం గురించి వారిని ఆంధ్రజ్యోతి సంప్రదించగా.. సమంత దక్షిణాఫ్రికా (Samantha South Africa) వెళ్లడం ఏంటని ఆమె వ్యక్తిగత టీం విస్మయం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి పుకార్లు ఏ సమాచారం లేకుండా ఎలా పుట్టిస్తారని రూమర్లపై ఆమె టీం మండిపడింది. సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లోని (Samantha Hyderabad House) తన ఇంట్లోనే ఉందని, ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా ఉందని సమంత గురించి స్పష్టత వచ్చింది.
సమంత, విజయ్ దేవరకొండ జంటగా ‘మజిలీ’ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ‘ఖుషీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే సమంత పాల్గొనాల్సి ఉంది. అయితే.. వైద్యుల సలహాతో విశ్రాంతి తీసుకుంటోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో సమంత భాగం కానుంది. ‘ఖుషీ’ సినిమా దర్శకుడు శివ నిర్వాణను సంప్రదించి సమంత ఆరోగ్యంపై ఆరా తీయగా.. అతను నవ్వి.. ఆమె చాలా హ్యాపీగా ఉందని.. షూటింగ్‌కు కూడా వస్తానని తమకు చెప్పిందని కుండబద్ధలు కొట్టాడు. ఆమెతో టచ్‌లోనే ఉన్నానని, ఆమె సంతోషంగా, ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా చూసుకుంటే.. సమంత పరిస్థితి విషమంగా ఉందని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది.
సమంత అనారోగ్యం గురించి ఫ్యాన్స్‌కు వెల్లడించిన సందర్భంలో ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘‘గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్’(Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ (Samantha autoimmune condition) సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇక మరొక్క రోజు కూడా ఇలా ఉండలేను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఐ లవ్ యూ’’ అని ఆ సందర్భంలో సమంత ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2022-11-30T14:49:58+05:30 IST