Andhrajyothy: ట్రైనీ జర్నలిస్టులు కావాలి
ABN, First Publish Date - 2022-12-16T18:20:40+05:30
Andhrajyothy College of Journalism
అర్హతలు
ఇంగ్లీషు భాషలో వ్యవహారజ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగల నేర్పు
వర్తమాన విషయాలపై అవగాహన, విశ్లేషణ సామర్థ్యం
సరళమైన తెలుగులో రాయగలగడం
చక్కటి భావవ్యక్తీకరణ
డిగ్రీ ఉత్తీర్ణత
35 సంవత్సరాలకు మించని వయసు
దరఖాస్తు విధానం
మీలో పై అర్హతలన్నీ ఉంటే పూర్తి పేరు, వయసు, విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, ఉద్యోగానుభవం, ఆసక్తులు వగైరా వివరాలన్నిటితో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తుకు సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఇటీవల తీసుకున్న రెండు ఫొటోలు జతపరచాలి.
దరఖాస్తులోను, కవరుపైన మీ పూర్తి చిరునామా, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్, పరీక్ష రాయదలచుకున్న కేంద్రం స్పష్టంగా రాయాలి.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు ఫోన్ ద్వారా మాత్రమే తెలియపరుస్తాం. అందువల్ల మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్‌నే దరఖాస్తులో ఇవ్వాలి.
ఏ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు, పాన్ ఇండియా సినిమాగా ఎదుగుతున్న తెలుగు సినిమా - ఈ రెండిటిలో ఏదో ఒక అంశంపై సొంతంగా రాసిన వ్యాసాన్ని దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. వ్యాసం లేని దరఖాస్తులను పరిశీలించం.
ఎంపిక
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
రాతపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
అభ్యర్థుల ఎంపికలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే తుది నిర్ణయం.
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లు పని చేస్తామని హామీపత్రం ఇవ్వాలి.
శిక్షణ
ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో కనీసం ఆరునెలల శిక్షణ ఉంటుంది.
భాష, భావవ్యక్తీకరణ, వర్తమాన వ్యవహారాలపై అవగాహన, అనువాదం, ఎడిటింగ్‌లలో శిక్షణ ఉంటుంది.
శిక్షణ ముగించుకున్నాక ట్రైనీ ఉద్యోగులుగా అవకాశం లభిస్తుంది. వీరు ఆంధ్రజ్యోతి యూనిట్లలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
వేతనం
శిక్షణ కాలంలో నెలకు రూ. 11,000
శిక్షణ అనంతరం జిల్లా విభాగాల్లో పని చేయడానికి ఎంపికైన వారికి రూ. 16,000
హైదరాబాద్, విజయవాడల్లోని ముఖ్యవిభాగాల్లో పని చేయడానికి అర్హులైన వారికి పనితీరును బట్టి రూ. 18,000 నుంచి 20,000
దరఖాస్తులు పంపవలసిన చిరునామా
ప్రిన్సిపాల్, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ప్లాట్ నెం. 76,
జూబ్లీహిల్స్, రోడ్డు నం. 70, హైదరాబాద్ - 500 110
దరఖాస్తులు చేరాల్సిన ఆఖరి తేదీ 2022, డిసెంబర్ 31.
Updated Date - 2022-12-21T13:23:41+05:30 IST