ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebookలో పరిచయం.. గుడిలో పెళ్లి.. శోభనం వేళ వరుడికి ఊహించని షాక్!

ABN, First Publish Date - 2022-11-02T19:32:52+05:30

ఆ ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ పెరిగింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. కొద్ది రోజులు ప్రేమలో మునిగి తేలిన ఆ జంట.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయింది. ఆ తర్వాతే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ పెరిగింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. కొద్ది రోజులు ప్రేమలో మునిగి తేలిన ఆ జంట.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయింది. ఆ తర్వాతే వరుడికి ఊహించని షాక్ తగిలింది. శోభనం రోజు వధువు గురించి అసలు విషయం తెలిసి అతడు కంగుతిన్నాడు. చివరికి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరఖండ్‌(Uttarakhand)లోని హరిద్వార్‌కు చెందిన యువకుడికి హర్యానాలోని హిసార్(Hisar) ప్రాంతానికి చెందిన యువతి.. ఇద్దరూ Facebookలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే ప్రేమలో పడ్డ ఆ ఇద్దరూ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులకు విషయం చెప్పకుండానే.. గుడిలో వివాహం(Marriage) చేసుకున్నారు. అనంతరం ఆ యువకుడు ఆమెతో కలిసి నేరుగా తన ఇంటికి వెళ్లాడు. చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చిన కుమారుడిని చూసి కుటుంబ మొదట్లో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. ఆ తర్వాత వాళ్ల పెళ్లిని ఆంగీకరించారు. ఈ క్రమంలోనే రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు.

నూతన వధూవరులద్దిరినీ గదిలోకి పంపించారు. ఈ నేపథ్యంలో వధువు గురించి వరుడికి సంచలన విషయం తెలిసింది. తాను పెళ్లి చేసుకుంది.. అమ్మాయిని కాదని, ఒక నపుంసకుడిని అని తెలిసి ఆ యువకుడు బిత్తరపోయాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. పెళ్లిని రద్దు చేయాలని కోరాడు. అయితే.. వధువు(అతడు) మాత్రం అందుకు ఒప్పుకేలేదు. చివరికి తనకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-11-02T19:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising