ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varalakshmi sarathkumar: సమంత ఫైటర్‌... త్వరలోనే...

ABN, First Publish Date - 2022-10-31T16:41:35+05:30

సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్పందించారు. సామ్‌ త్వరలోనే కోలుకుని మరింత బలంగా తిరిగి వస్తారని ఆమె ఆకాంక్షించారు. సమంత–వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ‘యశోద’ చిత్రంలో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalakshmi sarathkumar)స్పందించారు. సామ్‌ (Samantha)త్వరలోనే కోలుకుని మరింత బలంగా తిరిగి వస్తారని ఆమె ఆకాంక్షించారు. సమంత–వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ‘యశోద’ చిత్రంలో నటించారు. ఈ మేరకు ఆమె మయోసైటిస్‌తో (myositis disease)బాధపడుతున్న సమంత గురించి స్పందించారు. ‘‘సమంత నాకు 12 ఏళ్లగా తెలుసు. చెన్నైలోనే ఇద్దరికీ పరిచయం ఉంది. యశోద’ (Yashoda)సినిమా తనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సెట్‌లో ఇద్దరం సరదాగా ఉండేవాళ్లం. చెన్నైలో పాత రోజుల్ని గుర్తు చేసుకుని నవ్వుకునేవాళ్లం. యశోద్‌ షూటింగ్‌ సమయంలో సామ్‌ అనారోగ్యంతో ఉన్నట్లుగా మాకు అనిపించలేదు. తను చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని అనుకుంటున్నా. ఆమె ఒక ఫైటర్‌. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుంది ’’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అన్నారు. తదుపరి చిత్రాల గురించి కూడా వరలక్ష్మీ చెప్పుకొచ్చారు. ‘‘బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నా. ఆ పాత్ర క్రేజీగా ఉంటుంది. దీని కోసం 15 కిలోల బరువు తగ్గాను. దీనితోపాటు తెలుగు, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళం కన్నా తెలుగులో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. దీనికి ‘క్రాక్‌’ సినిమాలో జయమ్మ పాత్ర కారణం’’ అని అన్నారు. సరోగసి కథాంశంతో తెరకెక్కిన ‘యశోద’ నవంబర్‌ 11న విడుదల కానుంది.  హరి–హరీశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. 


Updated Date - 2022-10-31T16:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising