Emotional Video: కూతురిని కాలేజీకి పంపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-11-07T18:50:54+05:30 IST

తన కూతురిని కొత్త కాలేజీలో చేర్పించే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Emotional Video: కూతురిని కాలేజీకి పంపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. వైరల్ అవుతున్న వీడియో!

తన కూతురిని కొత్త కాలేజీలో చేర్పించే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్ష అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఏకంగా ఎనభై లక్షలకు పైగా వ్యూస్ పొందింది. అంతేకాదు 958,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.

నేను ఎన్నో కలలు కన్న ఢిల్లీ యూనివర్సిటీలోని మిరాండా హౌస్ కాలేజ్‌లో నన్ను దింపడానికి మా అమ్మానాన్నా వచ్చారు. క్యాంపస్‌లో ఇది నా మొదటి రోజు. అకస్మాత్తుగా మా నాన్న కళ్లలో కన్నీళ్లు రావడం గమనించానని ప్రేక్ష కామెంట్ చేసింది. అతను (తండ్రి) ఎంతో ఆనందపడ్డాడు. ఇక, అతని ప్రియ నేస్తం అతనికి చాలా దూరంగా జీవిస్తుందనే చేదు నిజం ఆ కన్నీళ్లకు కారణం. అమ్మా, నాన్న.. మీ మొహాలపై చిరునవ్వును చూడటానికి నేను ఏదైనా చేయగలను! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రేక్ష పేర్కొంది.

Updated Date - 2022-11-07T18:55:33+05:30 IST

Read more