Liger Effect: ఈడీ విచారణ హాజరైన విజయ్ దేవరకొండ

ABN, First Publish Date - 2022-11-30T12:20:28+05:30

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ (Liger).

Liger Effect: ఈడీ విచారణ హాజరైన విజయ్ దేవరకొండ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ (Liger). కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అయితే.. ఈ సినిమా బడ్జెట్ విషయంలో పలు ఆరోపణలు ఉన్నాయి. విదేశాల నుంచి పలువురు రాజకీయ నేతల అకౌంట్ నుంచి ఈ సినిమా నిర్మించడానికి డబ్బు బదిలీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మిను ఈడీ విచారించింది. తాజాగా విజయ్ దేవరకొండ సైతం ఈడీ విచారణకి హాజరయ్యాడు. ‘లైగర్’ చిత్రం గురించి, ఆయన పారితోషికంపై విజయ్‌ని ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 18న పూరీని, ఛార్మీ కౌర్‌ని ఈడీ విచారించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మనీ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘించారనే ఆరోపణలతో వారిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.

Updated Date - 2022-11-30T12:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising