ప్రేయసిని కలిసేందుకు వెళ్తే.. దగ్గరుండి మరీ పెళ్లి చేసి పంపించిన గ్రామస్తులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2022-05-14T00:51:29+05:30
ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పెద్దలను ఎదిరించడానికి కూడా వెనుకాడరు. కొన్ని ప్రేమ జంటలు తమ ప్రేమను పెళ్లి వరకు...
ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పెద్దలను ఎదిరించడానికి కూడా వెనుకాడరు. కొన్ని ప్రేమ జంటలు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తుండగా.. మరికొన్ని ప్రేమ జంటలు తమ ప్రేమను త్యాగం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ చాలా విచిత్రంగా ఉంది. ఓ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు. వారిని గమనించిన గ్రామస్తులు.. చివరికి ఇద్దరికీ పెళ్లి చేసి పంపించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని కచియావాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్ గ్రామానికి చెందిన యువకుడి సోదరి.. కచియావాన్ గ్రామంలో నివాసం ఉంటోంది. దీంతో తరచూ సోదరిని కలిసేందుకు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఓ యువతితో నెల రోజుల క్రితం యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అప్పటి నుంచి ప్రేయసిని కలిసేందుకు యువకుడు తరచూ ఆమె గ్రామానికి వెళ్తూ ఉండేవాడు. ఇటీవల మళ్లీ ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు.
పెళ్లి విందుకు పిలవలేదని పక్కిటి వ్యక్తుల నిర్వాకమిది.. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి..
గ్రామ పరిసరాల్లోని పొలాల్లో ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నారు. అయితే కొందరు గ్రామస్తులు గమనించి, వారిని గ్రామంలోని ఆలయానికి తీసుకెళ్లారు. గ్రామస్తులందరి సమక్షంలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇందుకు యువతి ఒప్పుకోగా.. యువకుడు మాత్రం బలవంతంగా పెళ్లి చేయడాన్ని నిరాకరించాడు. అయినా గ్రామస్తులు మాత్రం వారికి బలవంతంగా వివాహం జరిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఏదైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.