Vishwak Sen controversy: తప్పు చేశానంటే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా

ABN , First Publish Date - 2022-11-07T09:46:51+05:30 IST

‘‘సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, ఇష్టం లేకుండా నాలుగు రోజులు చేసి ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడాను. అర్జున్‌గారికి అంత గౌరవం ఇచ్చా.

Vishwak Sen controversy: తప్పు చేశానంటే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా

‘‘సినిమా షూటింగ్‌ ప్రారంభం (Vishwak Sen)కావడానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, ఇష్టం లేకుండా నాలుగు రోజులు చేసి ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడాను. అర్జున్‌గారికి అంత గౌరవం ఇచ్చా. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటం వల్ల ఇప్పుడు నాకు సంబంధించిన అందరూ బాధపడుతున్నారు. నేనేం చేయాలి. సినిమా నుంచి వైదొలగుతానని నేను చెప్పలేదు, సినిమాని నేను ఆపలేదు’’ అని విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)అన్నారు. అర్జున్‌ సర్జాకు(Arjun sarja), ఆయనకు సినిమా విషయంలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని గురించి శనివారం అర్జున్‌ మీడియా ముందు మాట్లాడారు. దానిపై విశ్వక్‌ ఆదివారం  ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరై ఆ వేదికపై స్పందించారు. (Vishwak Sen controversy)

‘‘నటుడిగా పరిచయం కావడానికి ఎన్నో సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగి అవమానపడ్డా. కానీ ఇప్పుడు హీరోగా ఎదగడం వల్ల వాటి గురించి ఎవరూ మాట్లాడరు. కానీ అవన్నీ మాకు గుర్తుంటాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని జాగ్రత్తగా ఉంటాం. అవకాశం వచ్చిందని నేను సినిమాలు చేయను. ప్యాషన్‌తో చేస్తా. నేను చేసే సినిమాకు సంబంధించిన అన్ని పనులు చూసుకుంటా. ప్రమోషన్స్‌ కూడా భుజాలపై వేసుకుంటా. అంత కమిట్‌మెంట్‌తో పని చేస్తా. నా అంత పొఫెషనల్‌ నటుడు ఉండడు. ఈ ఏడాది మూడు సినిమాలకుపని చేశా. అందులో ఒకదానికి నేనే దర్శకనిర్మాతను. నా వల్ల ఏ నిర్మాత బాధపడలేదు. నష్టపోలేదు. నేను నటించినవి చిన్న చిత్రాలు కావచ్చు కానీ పెద్ద నిర్మాతలు తీసిన చిత్రాలే అవన్నీ. సెట్‌లో ఒక్క లైట్‌బాయ్‌ అయినా.. నన్ను కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌ కాదంటే ఇండస్ర్టీ నుంచి వెళ్లిపోతా. ఏ దర్శకుడితో అయినా ‘గివ్‌ అండ్‌ టేక్‌’ పద్థతిలో పనిచేశా. అన్ని సినిమాల్లానే అర్జున్‌గారి చిత్రానికీ అదే అనుకుని మొదలుపెట్టాను. షూటింగ్‌కు వారం ముందు నాకు పూర్తి కథ అందింది.  ‘నేను ఆఫీస్‌ బాయ్‌ ఇన్‌పుట్‌ కూడా వింటా’ అని అర్జున్‌ సర్‌ అన్నారు. ‘నేను ఫలానా మార్పు చేేస్త బాగుంటుంది సర్‌’ అని చెబితే నువ్వు వదిలేయ్‌, నన్ను నమ్ము అంటూ ఏం చెప్పనిచ్చేవారు కాదు. పది విషయాల్లో..  రెండు నా ఇష్టానికి వదిలినా మ్రాపయాణం ముందుకెళ్లేది. కానీ నన్ను కట్టిపడేశారు. కళ్లుమూసుకుని కాపురం  చేసేయ్‌ అన్నట్లు నాకు అనిపించింది. అయినా లుక్‌ టెస్ట్‌ చేసి ఫొటోలు పంపా. షూటింగ్‌ రోజు ఎందుకో భయమేసింది. అలా ఎప్పుడూ జరగలేదు. అందుకే ‘సర్‌.. ఈ ఒక్కరోజు షూటింగ్‌ రద్దు చేేస్త.. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం’ అని మేేసజ్‌ పెట్టా. నేనూ మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన్నుంచి సమాధానం రాలేదు. అదే రోజు వాళ్ల మేనేజరు నుంచి.. ‘ఇంకేంటి మాట్లాడేది’ అంటూ అకౌంట్‌ వివరాలు పంపించారు. సినిమా నుంచి తప్పుకొంటా అని నేను అనలేదు. షూటింగ్‌కి ముందు క్యాన్సిల్‌ చేయటం తప్పే. ఆయన నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. అలాంటప్పుడు ఆయన చిత్రం గురించి నేనెందుకు మాట్లాడాలి? అనుకున్నా కాబట్టే నిన్న స్పందించలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానని ఎవరు చెప్పినా.. పరిశ్రమ నుంచి వెళ్లిపోతా. నా వల్ల ఇబ్బంది పడితే ఉంటే క్షమించండి సర్‌’’ అని విశ్వక్‌ ేసన్‌ అర్జున్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. 


Updated Date - 2022-11-07T09:46:51+05:30 IST

Read more