చెవి నొప్పితో డాక్టర్ దగ్గరకు వెళితే తెలిసిందో భయంకరమైన నిజం.. ఇంతకీ ఏమైందంటే..
ABN, First Publish Date - 2022-12-10T12:58:30+05:30
స్కానింగ్ లో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా భయపడిపోయారు
ఓ వ్యక్తి చెవినొప్పి, చెవిలో దురద, చెవి నుండి రక్తస్రావం అవుతుండటంతో డాక్టర్ ను సంప్రదించాడు. డాక్టర్లు అతని చెవి భాగాన్ని పరీక్ష చేసి తరువాత స్కానింగ్ తీసారు. స్కానింగ్ లో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. ఇంతకీ అతని చెవిలో డాక్టర్లకు కనిపించి భయపెట్టినది ఏంటి వంటి వివరాల్లోకి వెళితే...
64 సంవత్సరాల పోర్చుగీసు వ్యక్తి చెవిలో దురద, రక్తస్రావం, చెవినొప్పి కారణంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళగా డాక్టర్ ఆమెను పరీక్షించి స్కానింగ్ తీసాడు. ఆ స్కానింగ్ లో అతని చెవిలో మాంసాన్ని తినెయ్యగల మగ్గోట్ పురుగులు కనిపించాయి. అవి అప్పటికే అతని చెవిలో కొంత ప్రాంతాన్ని తిని అక్కడ రంధ్రం చేసాయట. వాటిని చూడగానే డాక్టర్ లు భయపడ్డారు. ఆ తరువాత షాక్ నుండి తేరుకుని మొదట అతని చెవిని నీటితో శుభ్రంగా కడిగి. ఆ తరువాత చెవిలో ఉన్న లార్వా దశ పురుగులను బయటకు తీసారు. అవి బ్రతికే ఉండటం వాటి కదలిక ద్వారా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మబాబోయ్!! అనుకుని చెవులు తడుముకుంటున్నారు.
Updated Date - 2022-12-10T13:26:10+05:30 IST