ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Year Ender 2022:‘ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడ్రా బాబూ!’.. గూగుల్‌ టాప్ సెర్చ్‌లో ఇదీ ఒకటి!

ABN, First Publish Date - 2022-12-24T11:06:10+05:30

విజ్ఞానం, వినోదం, ఆటలు, పాటలు.. రంగమేదైనా.. తెలియని విషయాన్ని క్షణాల్లోనే తెలియజెప్పే ఏకైక

Google Search
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజ్ఞానం, వినోదం, ఆటలు, పాటలు.. రంగమేదైనా.. తెలియని విషయాన్ని క్షణాల్లోనే తెలియజెప్పే ఏకైక మాస్టారు ‘గూగుల్’. వయసు తారతమ్యం లేకుండా అందరికీ గూగుల్ (Google) ముఖ్యమైన ఫ్రెండ్‌గా మారిపోయింది. ప్రతి ఇంటికీ వచ్చేసింది. సమాచారం ఫింగర్‌టిప్‌పై లభ్యమవుతున్న ఈ రోజుల్లో గూగుల్ నిత్యావసరమైంది. అయినదానికి, కానిదానికి గూగుల్‌లో నొక్కేయడం, చదివేయడం, తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. సరే, ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు దేని గురించి ఎక్కువగా శోధించారో (సెర్చ్), తెలంగాణలో ఎక్కువగా దేని గురించి వెతికారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా? ‘హౌ టు డ్రింక్ పోర్న్‌స్టార్ మార్టిని(‘How to Drink Pornstar Martini) అనే దాని గురించి ఎక్కువ మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోర్న్ స్టార్ మార్టిని అనేది ఫ్రూట్ ఫ్లేవర్డ్ కాక్‌టెయిల్. వెనిలా ఫ్లేవర్డ్ వోడ్కాతో తయారు చేస్తారు. ఇండియాలో ఎక్కువ మంది ‘ఫేస్‌బుక్ ఖాతాను తొలగించడం ఎలా?’ (How to delete a Facebook account) అనే దాని గురించి సెర్చ్ చేస్తే.. హైదరాబాదీలు మాత్రం..‘క్రొయిసెంట్’ అనే పదాన్ని ఉచ్చరించడం ఎలా? (How to pronounce ‘croissant) అన్న దానిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతోపాటు ‘ఎమోజీ’ అంటే? (What is the meaning of emoji) అన్న దాని గురించి సెర్చ్ చేశారు.

భారత రాష్ట్రపతి ఎవరు?

ఇక, ఎవరు? (Who) అన్న దాంతోనూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సెర్చ్‌లు జరిగాయి. ఆండ్రూ టేట్ (అమెరికన్-బ్రిటిష్ ఇంటర్నెట్ పర్సనాలిటీ)ను అనుసరిస్తున్నదెవరు? (Who is followed by Andrew Tate) అని ప్రపంచం శోధిస్తే.. ‘2022లో భారత రాష్ట్రపతి ఎవరు?’ (Who is the president of India 2022) అని సెర్చ్ చేశారు. తెలంగాణ యూజర్లు అయితే.. ‘తెలుగు బిగ్‌బాస్ 6 నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరు? (Who is eliminated in Bigg Boss Six Telugu) అని శోధిస్తే, కొందరు మాత్రం ‘అసలీ ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడురా బాబూ’ (Who invented exams) అని కూడా సెర్చ్ చేశారు.

వీటితోపాటు హైదరాబాదీలు ట్రావెల్‌కు సంబంధించిన సెర్చ్‌లు కూడా చేశారు. కరోనా మహమ్మారి తర్వాత తెరుచుకున్న హాలిడే డెస్టినేషన్స్ గురించి తెలుసుకున్నారు. అలాగే, ట్రావెల్ డెస్టినేషన్‌కు సంబంధించి ఎక్కువగా ‘వయనాడ్’ గురించి కూడా సెర్చ్ చేశారు. ప్రపంచం మాత్రం మరోలా సెర్చ్ చేసింది. ‘ధనవంతుడిని కావడం ఎలా?’ (How to become rich) అని వేగంగా డబ్బులు సంపాదించే మార్గాల గురించి శోధిస్తే.. ఇండియన్స్ మాత్రం.. ‘అందరినీ ఆకర్షించడం ఎలా’ (How to become a people magnet) అని కొందరు, ‘మిస్ యూనివర్స్ కావడం ఎలా? ( How to become miss universe) అని ఇంకొందరు సెర్చ్ చేశారు.

యూట్యూబ్‌లో..

యూట్యూబ్‌లో సెర్చ్‌ల విషయానికి వస్తే ‘సన్నబడడం ఎలా?’ (How to become thin) అనేది టాప్ సెర్చ్‌గా నిలిస్తే, ఆ తర్వాతి స్థానంలో ‘సీఈవో కావడం ఎలా?’ (How to become a CEO)’ అనేది నిలిచింది. ఇవే కాదు.. మనసును మెలిపెడుతున్న బాధ నుంచి తప్పించుకోవడం ఎలా అన్నదానిపైనా చాలామంది సెర్చ్ చేశారు. ‘ఒకరి ప్రేమను మర్చిపోవడం ఎలా?’ (How to forget someone you love) అన్నది టాప్ సెర్చ్‌లలో ఒకటిగా నిలిచింది. మరికొందరు కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు.

‘ఆకాశం నీలంగా ఎందుకుంటుంది?’ (Why is the sky blue?) అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మరికొందరు ‘ఏసీ ఎందుకు చల్లబడడం లేదు?’ (Why is AC not cooling), ‘ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు పనిచేయడం లేదు’ (Why is Instagram not working) అని ఫ్రస్ట్రేటెడ్ ప్రశ్నలు అడిగారు. ఇంకొందరు మాత్రం ‘టీచర్స్ డే కోసం గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం ఎలా?’ (How to make greeting cards for Teachers Day), ‘దీపాలను ఎలా అలంకరించాలి’ (How to decorate Diya), ‘పేపర్‌తో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఎలా చేయాలి?’(How to make friendship band with paper) అని గూగుల్‌ను ప్రశ్నించారు. ఇక ఈ ఏడాది బాగా వెదికిన పదాల్లో ‘వర్డల్’(Wordle), ‘మునుగోడు’ (Munugode) కూడా ఉండడం విశేషం.

మిగతా సెర్చ్‌లు ఇలా..

* డీజే టిల్లు.., హరహర శంభు, శ్రీవల్లి, రా రా రక్కమ్మ.. పాటల గురించి తెలంగాణ/హైదరాబాద్ వాసులు ఎక్కువ సెర్చ్ చేశారు.

* పాసూరి, హరహర శంభు, కచ్చా బాదమ్, కేసరియా పాటల గురించి ఇండియాలో ఎక్కువ మంది వెతికారు.

* ఐఫోన్ 14 ప్రొ, నథింగ్ ఫోన్, రియల్‌మి సి35, వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ల గురించి తెలంగాణ/హైదరాబాద్ జనాలు ఎక్కువగా వెతికారు.

* భారత్ విషయానికి వస్తే.. ఒప్పో కె10, అమెజాన్ మినీ టీవీ, టీవీఎస్ రోనిన్, ఐఫోన్ 13 గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు.

* తెలంగాణ/హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రాజా సింగ్, ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌లు, దేశంలో ఒమిక్రాన్ కేసుల గురించి తెలుసుకున్నారు.

* దేశంలో ఎక్కువమంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, బ్రహ్మాస్త్ర సినిమా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET), లతా మంగేష్కర్ గురించి ఎక్కువమంది శోధించారు.

Updated Date - 2022-12-24T11:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising