ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abrar Ahmed : ‘అబ్రా’కదబ్ర..

ABN, First Publish Date - 2022-12-10T00:47:32+05:30

పాకిస్థాన్‌ యువ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పిన్నర్‌ అబ్రార్‌కు ఏడు వికెట్లు

అరంగేట్రంలో సంచలనం

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 281

కరాచీ: పాకిస్థాన్‌ యువ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా ఏడు వికెట్లు తీసి వెన్నువిరిచాడు. తద్వారా పాక్‌ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఉత్తమ బౌలింగ్‌ గణాంకాలు (7/114) నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి రోజు శుక్రవారం అబ్రార్‌ ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. చివరి మూడు వికెట్లను జాహిద్‌ మహ్మూద్‌ తీయడంతో అబ్రార్‌కు ‘పర్‌ఫెక్ట్‌ టెన్‌’ రికార్డు దక్కకుండా పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ రోజు చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 107/2 స్కోరుతో నిలిచింది.

హ్యారీ పోటర్‌ను గుర్తుకు తెచ్చేలా..

24 ఏళ్ల అబ్రార్‌ను చూడగానే ఒక్కసారిగా అందరికీ హ్యారీ పోటర్‌ గుర్తుకురాక మానడు. అతడి కళ్లద్దాలు అచ్చంగా పోటర్‌ ధరించే మాదిరే ఉం టాయి. దీంతో సన్నిహితులు అబ్రార్‌ను హ్యారీ పోటర్‌గా పిలుస్తుంటారట. అరంగేట్రంలోనే ఇంత అద్భుతం చేసిన అబ్రార్‌కు పాక్‌ దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఎవరో తెలియదట. ఐదేళ్ల క్రితం పాక్‌ ఎన్‌సీఏ ప్రధాన కోచ్‌ ముస్తాక్‌ అహ్మద్‌ అప్పట్లో అబ్రార్‌కు ఇదే ప్రశ్న వేశాడట. ‘ఆయనెవరు? ఆ పేరెప్పుడూ వినలేదే’ అనే సమాధానంతో ముస్తాక్‌కు ఏమనాలో తెలీక బిగ్గరగా నవ్వేశాడట.

Updated Date - 2022-12-10T00:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising