FIFA World Cup Final: ఫైనల్‌లో దుమ్ము రేపుతున్న అర్జెంటినా

ABN, First Publish Date - 2022-12-18T21:38:09+05:30

ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న అర్జెంటినా.. 36 ఏళ్ల కలని నిజం చేసే దిశగా ముందుకు సాగుతోంది.

FIFA World Cup Final: ఫైనల్‌లో దుమ్ము రేపుతున్న అర్జెంటినా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖతర్: ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న అర్జెంటినా.. 36 ఏళ్ల కలని నిజం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఫ్రాన్స్‌తో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో దుమ్మురేపుతోంది. తొలి అర్ధభాగం ముగిసే సరికి రెండు గోల్స్‌తో ముందంజ వేసింది. దిగ్గజ ఆటగాడు మెస్సీ 23వ నిమిషంలో తొలి గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కాసేటికే మరో గోల్ లభించింది. ఏంజెల్ డి మారియా 36వ నిమిషంలో గోల్ సాధించి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఈ రెండో గోల్స్‌తో అర్జెంటినా శిబిరంలో కేరింతలు వినిపించాయి. ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియంను హోరెత్తించారు. మరోవైపు, అర్జెంటినా ఆటగాళ్ల దూకుడును నిలువరించడంలో విఫలమవుతున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు.. బంతిని నియంత్రించడంలో చతికల పడుతున్నారు.

Updated Date - 2022-12-18T21:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising