FIFA Semis Argentina vs Croatia : మెస్సీసేనకు సవాల్
ABN, First Publish Date - 2022-12-13T03:43:23+05:30
వరల్డ్‌కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. తడబడినా బలంగా పుంజుకొని టైటిల్ వేటలో నిలిచింది. అయితే, ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న క్రొయేషియా రూపంలో లాటిన్ అమెరికా జట్టుకు విషమ పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం
క్రొయేషియాతో అర్జెంటీనా సెమీఫైనల్ నేడు
స్పోర్ట్స్ 18, జియో సినిమాలో
రాత్రి 12.30 నుంచి
ఒంటిచేత్తో అర్జెంటీనాను సెమీస్‌కు చేర్చిన మెస్సీ ఒకవైపు.. సమష్టి పోరాటంతో
అంచనాలను తారుమారు చేస్తున్న
క్రొయేషియా మరోవైపు. సమవుజ్జీల సెమీస్ పోరులో.. వరల్డ్‌కప్ వేటలో ముందుకు వెళ్లేదెవరు? ఇంటిముఖం
పట్టేదెవరు? సాకర్ స్టార్లు నెమార్, క్రిస్టియానో రొనాల్డో కన్నీళ్లతో టోర్నీని వీడగా.. మరో దిగ్గజం వరల్డ్‌కప్ కల నేడు
కరిగిపోనుంది. మరి అది మెస్సీదా?
లేదంటే మోద్రిచ్‌దా?
దోహా: వరల్డ్‌కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. తడబడినా బలంగా పుంజుకొని టైటిల్ వేటలో నిలిచింది. అయితే, ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న క్రొయేషియా రూపంలో లాటిన్ అమెరికా జట్టుకు విషమ పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీఫైనల్లో 2018 రన్నరప్ క్రొయేషియాతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. లియోనెల్ మెస్సీకి దాదాపుగా ఇదే చివరి ప్రపంచకప్ కావడంతో అతడికి ఘనమైన వీడ్కోలు లభించాలని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ బలంగా కోరుకొంటున్నారు. గతానికి భిన్నంగా మెస్సీ కూడా ముందుండి జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. అద్భుతమైన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థుల గోల్ పోస్టుపైకి దాడులు చేయడం.. సహచరులకు మార్గదర్శనం చేస్తూ అర్జెంటీనా ఆటకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు. ప్రతిష్ఠంభన నెలకొన్నప్పుడు తన మాయాజాలంతో గోల్స్ చేస్తూ.. 1986లో డిగో మారడోనా తరహాలో ఒంటిచేత్తో అర్జెంటీనాను సెమీ్‌సకు చేర్చాడు. సెమీస్ మ్యాచ్‌లో కూడా జట్టు అతడి నుంచి ఇదేతరహా ఆటను ఆశిస్తోంది. లీగ్ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్న అర్జెంటీనా.. ఆ తర్వాత పోలెండ్, మెక్సికోలపై గెలిచి నాకౌట్‌కు చేరుకొంది. రౌండ్-16లో ఆస్ట్రేలియా నుంచి గట్టిపోటీ ఎదురైనా నెగ్గుకొచ్చిన మెస్సీ సేనకు క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆధిక్యాన్ని చేజార్చుకొన్న అర్జెంటీనా.. కీపర్ మార్టినెజ్ హీరోచిత సేవ్‌లతో.. పెనాల్టీ షూటౌట్‌లో గట్టెక్కింది. కాగా, ఎక్కువ ఎల్లో కార్డుల కారణంగా స్ట్రయికర్ మార్కోస్ అకునా కీలక మ్యాచ్‌కు దూరం కావడం అర్జెంటీనాకు దెబ్బే..! అతడి స్థానాన్ని నికోలస్ ట్యాగ్‌లియాఫికోతో భర్తీ చేసే అవకాశం ఉండగా.. డిమారియా ఫిట్‌నె్‌సపై అనుమానాలున్నాయి.
పోరాటమే బలం: పట్టుదలే ఆయుధంగా సాగుతున్న క్రొయేషియా.. కప్పు వేటలో అర్జెంటీనాకు అడ్డుగా నిలుస్తోంది. వెటరన్ లూకా మోద్రిచ్ నేతృత్వంలో క్రొయేషియా ఫుల్‌జో్‌షలో ఉంది. లీగ్ దశలో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేక పోయినా.. క్రమంగా గేర్ మార్చింది. రౌండ్-16లో జపాన్‌పై గెలిచిన మోద్రిచ్ సేన.. క్వార్టర్స్‌లో బ్రెజిల్‌ను షూటౌట్ చేసింది. రష్యాలో జరిగిన మెగా ఈవెంట్‌లో అర్జెంటీనాను చిత్తు చేసిన క్రొయేషియాను తేలిగ్గా తీసుకొన్నా.. ఫలితం తారుమారయ్యే అవకాశాలున్నాయి. ఆఖరి నిమిషం వరకు ఆశలు వదులుకోకుండా ఐక్యంగా పోరాడడం క్రొయేషియా ప్లస్ పాయింట్. గోల్స్‌లో వెనుకంజలో ఉన్నా అలుపెరుగకుండా దాడులు చేస్తూనే ఉంటుంది. ప్లేయర్లు ఎవరూ సస్పెండ్ కాకపోవడంతో.. బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. బ్రెజిల్‌పై గోల్ చేసిన బ్రూనో పెట్కోవిచ్, పెరిసిచ్‌తో ఫార్వర్డ్ విభాగం పదునుగా కనిపిస్తుండగా.. డిఫెండర్ బోర్నా సోసా తిరిగి జట్టులోకి రావడంతో డిఫెన్స్ మరింత పటిష్టమైంది. ఓటమి అంచుల నుంచి తప్పించుకొని సెమీ్‌సకు చేరిన క్రొయేషియాలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఎక్స్‌ట్రా టైమ్, షూటౌట్‌కు పరిస్థితులు దారితీస్తే.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అర్జెంటీనాకు ప్రతికూల ఫలితం వచ్చే చాన్సుంది. మొత్తంగా చూస్తే మ్యాచ్ ఆసాంతం ఫ్యాన్స్‌కు మస్తు మజాను పంచనుంది.
2 విశ్వక్‌పలో అర్జెంటీనా, క్రొయేషియా రెండుసార్లు తలపడ్డాయి. వీటిలో చెరో మ్యాచ్ నెగ్గాయి. 1998లో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో క్రొయేషియాపై గెలవగా, 2018లో గ్రూప్ దశలో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను చిత్తు చేసింది.
5 గతంలో ఐదుసార్లు సెమీస్ చేరిన అర్జెంటీనా.. అన్నిసార్లూ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Updated Date - 2022-12-13T03:43:24+05:30 IST