బంగ్లా టూర్ నుంచి జడేజా, యశ్ అవుట్
ABN, First Publish Date - 2022-11-24T01:24:10+05:30
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, లెఫ్టామ్ మీడియం పేసర్ యశ్ దయాళ్ వచ్చేనెలలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్
కుల్దీప్ సేన్, షాబాజ్‌తో భర్తీ
న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, లెఫ్టామ్ మీడియం పేసర్ యశ్ దయాళ్ వచ్చేనెలలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్టు నుంచి దూరమయ్యారు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున జడేజాను, వెన్ను నొప్పి కారణంగా దయాళ్‌ను బంగ్లాతో సిరీస్ నుంచి తప్పించినట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. వీరిద్దరి స్థానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్, పేసర్ కుల్దీప్ సేన్‌ను జట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరు శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత్ ఆడే వన్డే జటుకు ఇంతకుముందే ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరూ కివీ్‌సతో వన్డేలకు దూరమవుతారనీ, బంగ్లా పర్యటనకు వెళతారని బోర్డు తెలిపింది. బంగ్లాతో డిసెంబరు 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న భారత్.. ఆ తర్వాత 14 నుంచి రెండు టెస్టులు ఆడనుంది.
Updated Date - 2022-11-24T01:24:11+05:30 IST