ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FIFA World Cup : ఊపిరులూదిన మెస్సీ

ABN, First Publish Date - 2022-11-28T00:48:00+05:30

వరల్డ్‌కప్‌నకు ముందు వరుసగా 36 విజయాలు.. హాట్‌ ఫేవరెట్‌గా మెగా టోర్నీ బరిలోకి దిగిన అర్జెంటీనాకు.. తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో భారీ షాక్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేసులోనే అర్జెంటీనా

2-0తో మెక్సికోపై విజయం

ఫిఫా వరల్డ్‌కప్‌

వరల్డ్‌కప్‌నకు ముందు వరుసగా 36 విజయాలు.. హాట్‌ ఫేవరెట్‌గా మెగా టోర్నీ బరిలోకి దిగిన అర్జెంటీనాకు.. తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో భారీ షాక్‌. అంతటా విమర్శలు.. సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం. విశ్వకప్‌ రేసులో నిలవాలంటే.. రెండో మ్యాచ్‌లో విజయం ఎంతో కీలకం. కానీ, ప్రత్యర్థి మెక్సికో.. కొరకరాని కొయ్య. ఈ పరిస్థితుల్లో కొండంత అవమాన భారంతో.. బేలగా కనిపిస్తున్న అర్జెంటీనా ఆటగాళ్లను చూసి ఫ్యాన్స్‌ మొహాల్లో కనిపించని సంతోషం. అందుకు తగ్గట్టుగానే తొలి అర్ధ భాగంలో నమోదుకాని గోల్స్‌..!

నలుదిశలా స్తబ్ధత నెలకొన్న సమయంలో.. మెస్సీ మెరుపు గోల్‌తో ఒత్తిడంతా హుష్‌ కాకి..! ఫ్యాన్స్‌లో సంబరాలు.. డీలాపడ్డ జట్టులో ఒక్కసారిగా వేయి వోల్టుల కరెంట్‌..! ఎప్పుడు గోల్‌ చేసినా పెద్దగా సంబరాలు చేసుకోని మెస్సీ కూడా.. ఉద్వేగంగా మైదానంలో ప్రవర్తించాడంటే ఈ గోల్‌ వారికి ఎంతటి కీలకమో అర్థమవుతోంది. ఇదే జోష్‌లో మరో గోల్‌ సాధించిన అర్జెంటీనా.. రేసులోకి వచ్చింది.

లుసెయిల్‌ (ఖతార్‌): లియోనెల్‌ మెస్సీ స్ఫూర్తిదాయక గోల్‌తో అర్జెంటీనా వరల్డ్‌కప్‌ ఆశలను సజీవంగా ఉంచుకొంది. గ్రూప్‌-సిలో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో మెక్సికోను ఓడించింది. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతున్న మెస్సీ సేన.. ఘోర ఓటమినుంచి వేగంగా పుంజుకొంది. మెస్సీ (64వ), సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు ఎన్‌జో ఫెర్నాండెజ్‌ (87వ) చెరో గోల్‌తో అర్జెంటీనాను గెలిపించారు.

ఒక్క గోల్‌తో ప్రాణం లేచొచ్చింది..: అర్జెంటీనా.. ఆరంభం నుంచే బంతిపై ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థిపై దాడులకు దిగింది. కానీ, రక్షణాత్మకంగా వ్యవహరించిన మెక్సికో.. ప్రత్యర్థిని అసహనానికి గురి చేసింది. ముఖ్యంగా మెస్సీ లక్ష్యంగా మార్కింగ్‌ చేసేందుకు ఇద్దరిని మోహరించడంతో.. అర్జెంటీనా కచ్చితమైన దాడులు చేయలేకపోయింది. అయితే, 20వ నిమిషంలో ఒటామెడీ ఫౌల్‌తో మెక్సికోకు ఫ్రీ కిక్‌ లభించింది. దీన్ని అర్జెంటీనా కీపర్‌ మార్టినెజ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా కొన్ని దాడులు చేసినా.. ఫినిషింగ్‌ లోపంతో గోల్స్‌ చేయలేకపోయింది. 32వ నిమిషంలో మెస్సీ ఫ్రీకిక్‌ కూడా నిష్ఫలమైంది. ఇరుజట్లూ గోల్స్‌ చేయడంలో విఫలమవడంతో ఫస్టాఫ్‌ 0-0తో ముగిసింది. సెకండా్‌ఫలో ఈ ప్రతిష్ఠంభనకు మెస్సీ తెరదించాడు. 64 నిమిషంలో డి మారియా క్రాస్‌ను అందుకొన్న మెస్సీ.. 25 మీటర్ల దూరం నుంచి కొట్టిన షాట్‌.. గోల్‌ పోస్టుకు సమీపంగా వెళ్లి నెట్‌లో పడడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి అర్జెంటీనా ఆటలో వేగం పెరిగింది. ఈక్రమంలో 87వ నిమిషంలో కార్నర్‌ షాట్‌ను అందుకొన్న ఫెర్నాండెజ్‌.. మెక్సికన్‌ డిఫెండర్లను తప్పిస్తూ కొట్టిన కిక్‌.. గాల్లో సుడులు తిరుగుతూ వెళ్లి గోల్‌లో పడింది. దీంతో 2-0తో పటిష్ట స్థితిలో నిలిచిన అర్జెంటీనా ఆధిక్యాన్ని చివరిదాకా నిలబెట్టుకొంది. గ్రూప్‌-సిలో పోలెండ్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో నెగ్గితే అర్జెంటీనాకు నాకౌట్‌ బెర్త్‌ ఖరారవుతుంది.

భారీగా హాజరు

అర్జెంటీనాకు కీలక మ్యాచ్‌ కావడంతో తమ జట్టుకు మద్దతుగా నిలిచేందుకు ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. 88,966 మంది ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం.. గత 28 ఏళ్లలో ఇదే అత్యధికం. 1994లో అమెరికాలో బ్రెజిల్‌, ఇటలీ మధ్య జరిగిన జరిగిన మెగా ఫైనల్‌కు భారీగా 91,194 మంది హాజరయ్యారు. కాగా, 1950లో మరకానా స్టేడియంలో ఉరుగ్వే-బ్రెజిల్‌ మధ్య జరిగిన ఫైనల్‌కు 1,73,850 హాజరవడం వరల్డ్‌క్‌పలో చరిత్ర.

Updated Date - 2022-11-28T00:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising