ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs ENG: దుమ్మురేపిన విరాట్, హార్థిక్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..

ABN, First Publish Date - 2022-11-10T15:20:15+05:30

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న అమీతుమీ సెమీస్‌లో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 169 పరుగుల లక్ష్యాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిలైడ్ ఓవల్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న అమీతుమీ సెమీస్‌లో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 169 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ మధ్య మంచి ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 5 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి క్రిస్ ఓక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు కీపర్ క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50 కొట్టి హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులుతో ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌, ఫోర్‌తో అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత ఓవర్‌లోనే షాట్‌కు యత్నించి అడిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు.

టీమిండియా హిట్టర్ హార్థిక్ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు చేసి 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో దుమ్మురేపాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో మంచి స్కోర్ చేసి జట్టుకు అండగా నిలిచాడు. దీంతో.. టీమిండియా 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌కు నిర్దేశించగలిగింది. ఇక.. టీమిండియా బౌలర్లపై పెద్ద బాధ్యతే ఉంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బట్లర్, బెన్ ‌స్టోక్స్, హేల్స్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ వంటి ఆల్ రౌండర్లతో ఆ జట్టు బ్యాటింగ్ టీమిండియా బౌలర్లకు సవాల్ విసురుతోంది.

Updated Date - 2022-11-10T16:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising