ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుమరుగుకానున్న ‘స్టేడియం 974’

ABN, First Publish Date - 2022-12-04T00:21:34+05:30

వరల్డ్‌కప్‌ కోసం ఖతార్‌లో నిర్మించిన ఏడు నూతన వేదికల్లో ‘స్టేడియం 974’ ప్రత్యేకం. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఈ స్టేడియం పేరు, నిర్మించిన విధానం ఎక్కువగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: వరల్డ్‌కప్‌ కోసం ఖతార్‌లో నిర్మించిన ఏడు నూతన వేదికల్లో ‘స్టేడియం 974’ ప్రత్యేకం. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఈ స్టేడియం పేరు, నిర్మించిన విధానం ఎక్కువగా ఆకర్షించింది. అయితే, విశ్వకప్‌ ముగిసిన తర్వాత ఈ మైదానం కనుమరుగుకానుంది. ఎందుకంటే.. 40 వేల సీటింగ్‌ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియాన్ని తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. ఇందు కోసం షిప్పింగ్‌ కంటైనర్లు, టన్నుల కొద్దీ స్టీల్‌ను ఉపయోగించారు. టోర్నీ ముగిసిన తర్వాత ఆ స్టీల్‌ నిర్మాణాలను విడదీసి.. అవసరమైన దేశానికి వాటిని తరలించనున్నారు. ఇలాంటి తాత్కాలిక వేదికల వల్ల భవిష్యత్తులో నిర్వహణ భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖతార్‌ అంతర్జాతీయ డయలింగ్‌ కోడ్‌ ‘974’తోపాటు నిర్మాణంలో వాడిన కంటెయినర్ల సంఖ్యను సూచిస్తూ స్టేడియానికి ఇలా వెరైటీగా పేరు పెట్టారు.

Updated Date - 2022-12-04T00:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising