ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FIFA Quarter Final : అటో.. ఇటో

ABN, First Publish Date - 2022-12-10T00:57:31+05:30

వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో మరో ఉత్కంఠ సమరానికి వేళైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌, దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక కప్‌ అందుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగ్లండ్‌ X ఫ్రాన్స్‌ (రాత్రి 12.30గం.)

పోర్చుగల్‌ X మొరాకో (రాత్రి 8.30 గం)

అల్‌ ఖోర్‌ (ఖతార్‌) : వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో మరో ఉత్కంఠ సమరానికి వేళైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌, దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక కప్‌ అందుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్‌ శనివారం అర్ధరాత్రి జరిగే రౌండ్‌-8 పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన 31 మ్యాచ్‌ల్లో 17 విజయాలు, తొమ్మిది పరాజయాలు, ఐదు డ్రాలతో ఇంగ్లండ్‌ పేపర్‌పై తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మరోవైపు ప్రపంచ కప్‌లలో ఇరుజట్లూ తలపడిన రెండుసార్లూ ఇంగ్లండ్‌ నెగ్గింది. తొలిసారి 1966, తర్వాత 1982లో తలపడ్డాయి. ఇదంతా గతం. ప్రస్తుతం ఫ్రాన్స్‌ అటాకింగ్‌, మిడ్‌ఫీల్డ్‌లో అదరగొడుతోంది. మొత్తంగా ఈ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు మజా పంచడం ఖాయం.

మొరాకో నిలువరించేనా?

పోర్చుగల్‌తో రౌండ్‌-8 పోరు

దోహా: టోర్నమెంట్‌ ఫేవరెట్‌ స్పెయిన్‌ను షూటవుట్‌ చేసిన ఆత్మవిశ్వాసంలో మొరాకో..రౌండ్‌-16లో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసిన ఉత్సాహంలో పోర్చుగల్‌..ఈ రెండు జట్లు శనివారం జరిగే క్వార్టర్స్‌ పోరుకు సై అంటున్నాయి. వరల్డ్‌ కప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు రెండుసార్లు తలపడగా చెరోసారి నెగ్గాయి. కాగా..పోర్చుగల్‌ కోచ్‌ శాంటో్‌స..క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లోనూ రొనాల్డోను బెంచ్‌పైనే కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-12-10T00:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising