FIFA world cup: ఫిఫాకు మరీ ఇంత క్రేజా.. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వేరే లెవల్..
ABN, First Publish Date - 2022-11-22T21:20:45+05:30
ఎడాది దేశం ఖతార్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA world cup2022) ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్‌ని ఊర్రూతలూగిస్తోంది. స్టేడియాల్లో కనీసం బీరు లభించదు..
దోహా: ఎడాది దేశం ఖతార్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA world cup2022) ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్‌ని ఊర్రూతలూగిస్తోంది. స్టేడియాల్లో కనీసం బీరు లభించదు.. టెంట్స్ లేదా తాత్కాలిక నిర్మాణాల్లోనే బస.. అసౌకర్యానికి గురిచేసే అక్కడి ఉష్ణోగ్రతలు.. మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు.. ఈ అవరోధాలేవీ ఫుట్‌బాల్ ప్రేమికులను ఖతార్ వెళ్లకుండా నిలువరించడం లేదు. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్ పండుగను వీక్షించేందుకు వెళ్లిన అభిమానులతో స్టేడియాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఫ్యాన్స్ తాకిడి ఏ స్థాయిలో ఉందంటే.. కొంతమంది ఫ్యాన్స్ తమ దేశానికి చెందిన జట్టు ఈ మెగా టోర్నీలో లేకపోయినా ఇతర జట్లకు మద్ధతిచ్చేందుకు వెళ్తున్నారు. దీంతో దోహా నగర వీధులన్నీ అన్నీ టీమ్‌ల మద్దతుదారుల నిండిపోతున్నాయి. ముఖ్యంగా సాయంత్ర సమయాల్లో సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఫ్యాన్స్ సాయంత్ర సమయాల్లో డ్రమ్స్ వాయిస్తూ, పాటలు పడుతూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
అలాంటి ఫ్యాన్స్ సమూహాల్లో భారత్ నుంచి ఇంగ్లండ్‌కు సపోర్ట్ చేయడానికి వెళ్లిన బృందం కూడా గమనార్హం. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ హ్యారీ కేన్ (Harry Kane) పేరుతో ఉన్న ఒకేతరహా జెర్సీలను వీరంతా ధరించారు. కేరళ నుంచి ఖతార్ వచ్చామని, ఇంగ్లండ్ జట్టుపై అభిమానంతో మద్దతు ఇస్తున్నామని వారు చెప్పారు. కెప్టెన్ హ్యారీ కేన్ అంటే తమకెంతో ఇష్టమని వారు చెప్పారు. ఇలా తమకు నచ్చిన దేశాలకు సపోర్ట్ ఇచ్చేందుకు వెళ్లిన అభిమానుల చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా వ్యాపారపరంగా, పర్యాటకంగా అక్కడివారికి కలిసొస్తోంది.
Updated Date - 2022-11-22T21:22:14+05:30 IST