FIFA Worldcup: ప్రపంచాన్ని మెప్పించిన జపాన్ ఫుట్‌బాల్ ప్లేయర్స్.. జర్మనీపై విజయం తర్వాత..

ABN, First Publish Date - 2022-11-24T22:00:29+05:30

ఫిఫా వరల్డ్ కప్ 2022లో (FIFA Worldcup 2022) భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట జర్మనీని (Germany) మట్టికరిపించిన జపాన్ (Japan) సంచలనం సృష్టించింది.

FIFA Worldcup: ప్రపంచాన్ని మెప్పించిన జపాన్ ఫుట్‌బాల్ ప్లేయర్స్.. జర్మనీపై విజయం తర్వాత..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: ఫిఫా వరల్డ్ కప్ 2022లో (FIFA Worldcup 2022) భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట జర్మనీని (Germany) మట్టికరిపించిన జపాన్ (Japan) సంచలనం సృష్టించింది. దీంతో జపాన్ మద్ధతుదారులు, ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఆనందంలో తేలిపోయారు. కానీ ఇంతటి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న జపాన్ ఆటగాళ్లు మాత్రం పొంగిపోకుండా హూందాగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సోషల్ యూజర్ల హృదయాలను గెలుచుకున్నారు. అంత ఆకట్టుకునేలా జపాన్ ప్లేయర్ ఏం చేశారో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

జర్మనీపై అద్భుత విజయాన్ని అందుకున్న జపాన్ ఆటగాళ్లు ఆనందోత్సాహాల్లో తేలిపోకుండా వారి లాకర్ రూమ్‌ను స్వతహాగా శుభ్రం చేశారు. ఎక్కడా చిన్న మరక కూడా కనిపించకుండా క్లీన్ చేశారు. ఈ మేరకు జపాన్ ఆటగాళ్ల లాకర్ రూమ్ ఫొటోను సోషల్ మీడియాలో ఫిఫా షేర్ చేసింది. ‘‘ జర్మనీపై విజయం అనంతరం జపాన్ ఫ్యాన్స్ స్టేడియంలోని చెత్తను తొలగించి శుభ్రం చేయగా.. జపాన్ ఆటగాళ్లు ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలోని వారి లాకర్ రూమ్‌ను మరక లేకుండా శుభ్రం చేశారు’’ అని రాసుకొచ్చింది. కాగా అప్పటికే స్టేడియంలోని వాటర్ బాటిల్స్, కాగితాలు, ఇతర చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న జపాన్ ఫ్యాన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జపాన్ ఫుట్‌బాల్ ప్లేయర్లు, వారి ఫ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేశారంటూ తెగపొగిడేస్తున్నారు.

Updated Date - 2022-11-24T22:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising