లక్ష్యసేన్, విమల్‌పైనా.. ఎఫ్‌ఐఆర్
ABN, First Publish Date - 2022-12-04T00:19:08+05:30
దేశ టాప్ షట్లర్ లక్ష్యసేన్, అతడి కుటుంబం, జాతీయ బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్‌పై చీటింగ్
న్యూఢిల్లీ: దేశ టాప్ షట్లర్ లక్ష్యసేన్, అతడి కుటుంబం, జాతీయ బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్‌పై చీటింగ్ కేసుకు సంబంధించి బెంగళూరులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లక్ష్యసేన్ అతడి సోదరుడు చిరాగ్ సేన్ తమ వయస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలను ఫోర్జరీ చేశారని బెంగళూరులోనే బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహిస్తున్న గోవియప్ప నాగరాజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సేన్ సోదరులు, అతడి తండ్రి, శాయ్ కోచ్ ధీరేంద్ర, తల్లి నిర్మలతోపాటు కోచ్ విమల్‌పై మోసం (సెక్షన్ 420), ఫోర్జరీ (468), తప్పుడు ధ్రువపత్రాన్ని అసలైనదిగా పేర్కొనడం (471) తదితర సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Updated Date - 2022-12-04T00:19:09+05:30 IST