ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FIFA Semis : కేన్‌ మిస్‌.. సెమీస్‌కు ఫ్రాన్స్‌

ABN, First Publish Date - 2022-12-12T05:05:00+05:30

ఇద్దరూ రికార్డు గోల్స్‌ స్కోరర్లు.. కానీ ఫలితమే భిన్నం! ఆలివర్‌ గిరోర్డ్‌ సూపర్‌ హెడర్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను సెమీస్‌ చేర్చగా.. హ్యారీ కేన్‌ పెనాల్టీ మిస్‌తో ఇంగ్లండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరోర్డ్‌ విన్నింగ్‌ గోల్‌

2-1తో ఇంగ్లండ్‌పై విజయం

సెమీఫైనల్లో ఎవరితో ఎవరు

అర్జెంటీనా X క్రొయేషియా (మంగళవారం రాత్రి 12.30)

ఫ్రాన్స్‌ X మొరాకో (బుధవారం రాత్రి 12.30)

అల్‌ ఖోర్‌ (ఖతార్‌): ఇద్దరూ రికార్డు గోల్స్‌ స్కోరర్లు.. కానీ ఫలితమే భిన్నం! ఆలివర్‌ గిరోర్డ్‌ సూపర్‌ హెడర్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను సెమీస్‌ చేర్చగా.. హ్యారీ కేన్‌ పెనాల్టీ మిస్‌తో ఇంగ్లండ్‌ ఇంటిముఖం పట్టింది. శనివారం రాత్రి హోరాహోరీగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 2-1తో ఇంగ్లండ్‌ను ఓడించి.. ఏడోసారి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకొంది. ఫైనల్లో చోటుకోసం అండర్‌డాగ్‌ మొరాకోతో అమీతుమీ తేల్చుకోనుంది. ఫ్రెంచ్‌ టీమ్‌ తరఫున అరేలియన్‌ టెకౌహామెనీ (17వ), గిరోర్డ్‌ (78వ) గోల్స్‌ చేయగా.. ఇంగ్లిష్‌ ఆటగాడు హ్యారీ కేన్‌ (54వ) ఓ గోల్‌ సాధించాడు. 1-2తో వెనుకంజలో ఉన్న సమయంలో.. మ్యాచ్‌ చివరి 6 నిమిషాల్లో స్కోరు సమం చేయడానికి ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్‌ రూపంలో సువర్ణావకాశం లభించింది. కానీ, కేన్‌ కొట్టిన కిక్‌.. గోల్‌ బార్‌ పైనుంచి బయటకు పోవడంతో ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరయ్యాయి. గత (2018) వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌ సెమీ్‌సలో ఓడిన సంగతి తెలిసిందే.

కేన్‌ సేన జోరు చూపినా..: ఫ్రాన్స్‌తో పోల్చితే ఇంగ్లండ్‌ దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. కానీ, ఫ్రెంచ్‌ జట్టు ఆరంభంలోనే గోల్‌ చేయడంతో.. హ్యారీ కేన్‌ టీమ్‌ స్కోరు సమం చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌ కొన్ని అద్భుతమైన అవకాశాలు సృష్టించుకొన్నా.. వాటిని ఫ్రాన్స్‌ కీపర్‌ హ్యూగో లోరిస్‌ సమర్ధంగా అడ్డుకొన్నాడు. ఫస్టాఫ్‌ ఆరంభమైన 17వ నిమిషంలోనే ఫ్రాన్స్‌ గోల్‌ చేయడంతో.. టోర్నీలో ఇంగ్లండ్‌ తొలిసారి వెనుకంజలో నిలిచింది. అయితే, 29వ నిమిషంలో హ్యారీ కేన్‌ బాక్స్‌ బయట నుంచి కొట్టిన షాట్‌ను కీపర్‌ లోరిస్‌ బయటకు నెట్టేశాడు. ఆ తర్వాత ఇరుజట్లూ గోల్‌ ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోవడంతో ఫ్రాన్స్‌ 1-0 ఆధిక్యంతో బ్రేక్‌కు వెళ్లింది. ఇక, సెకండాఫ్‌ మొదలైన రెండో నిమిషంలోనే ఇంగ్లండ్‌కు కార్నర్‌ రూపంలో మంచి అవకాశం లభించింది. ఫోడెన్‌ కొట్టిన కిక్‌ను అందుకొన్న బెల్లింగ్‌హామ్‌.. నేరుగా ఫ్రాన్స్‌ గోల్‌ పోస్టులోకి షూట్‌ చేసినా కీపర్‌ అడ్డుకొన్నాడు. అయితే, సాకాను అరేలియన్‌ మొరటుగా అడ్డుకోవడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్‌ లభించింది. దీన్ని హ్యారీ గోల్‌గా మలచి 1-1తో స్కోరు సమం చేశాడు. అనంతరం ఇంగ్లండ్‌ చేసిన రెండు గోల్‌ ప్రయత్నాలు సఫలం కాలేదు. కాగా, 77వ నిమిషంలో ఫ్రెంచ్‌ ఆటగాడు గిరోర్డ్‌ కొట్టిన కిక్‌ను ఇంగ్లండ్‌ కీపర్‌ పిక్‌ఫోర్డ్‌ అద్భుతంగా అడ్డుకొన్నాడు. కానీ, ఆ తర్వాతి నిమిషంలో గ్రీజ్‌మన్‌ క్రాస్‌ను గిరోర్డ్‌ హెడర్‌తో గోల్‌లోకి పంపి ఫ్రాన్స్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఇక, 80వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో మౌంట్‌ను అడ్డుకొనే క్రమంలో హెర్నాండెజ్‌ ఫౌల్‌ చేయడంతో.. సమీక్షించిన రెఫరీ ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. కానీ, హ్యరీ దీన్ని బయటకు కొట్టడంతో ఫ్రాన్స్‌ సంబరాలు చేసుకొంది.

7 వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌లో అత్యధికంగా ఏడుసార్లు ఇంటిముఖం పట్టిన జట్టుగా ఇంగ్లండ్‌ చెత్త రికార్డును మూటగట్టుకొంది.

Updated Date - 2022-12-12T05:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising