ఘనా ఆశలు సజీవం
ABN, First Publish Date - 2022-11-29T01:07:06+05:30
వరల్డ్ కప్‌లో సోమవారం జరిగిన మరో మ్యాచ్ కూడా ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టింది. గ్రూప్ ‘హెచ్’లో దక్షిణ కొరియాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఘనా 3-2తో నెగ్గి నాకౌట్
అల్ రయాన్: వరల్డ్ కప్‌లో సోమవారం జరిగిన మరో మ్యాచ్ కూడా ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టింది. గ్రూప్ ‘హెచ్’లో దక్షిణ కొరియాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఘనా 3-2తో నెగ్గి నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సలీసు (24) ఘనాకు బోణీ చేయగా, కుడూస్ (34, 68) రెండు గోల్స్‌తో సత్తా చాటాడు. చో సంగ్ (58, 61) మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టడంతో కొరియా సమంగా నిలిచింది. కానీ కొరియా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి కుడూస్ చేసిన గోల్‌తో ఆఫ్రికా జట్టు ఈసారి టోర్నీలో తొలి విజయం అందుకుంది.
Updated Date - 2022-11-29T01:07:08+05:30 IST