ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షూస్‌తో పాటు సాక్స్‌లనూ విప్పించారు..

ABN, First Publish Date - 2022-11-29T01:11:43+05:30

బుండెస్‌ లిగా చెస్‌ టోర్నమెంట్‌లో సోమవారం భారత గ్రాండ్‌మాస్టర్‌ ఎస్‌ఎల్‌ నారాయణన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జర్మనీలో జరుగుతున్న ఈ చెస్‌ లీగ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎం నారాయణన్‌కు చేదు అనుభవం

చెన్నై: బుండెస్‌ లిగా చెస్‌ టోర్నమెంట్‌లో సోమవారం భారత గ్రాండ్‌మాస్టర్‌ ఎస్‌ఎల్‌ నారాయణన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జర్మనీలో జరుగుతున్న ఈ చెస్‌ లీగ్‌లో మ్యాచ్‌లకు ముందు మెటల్‌ డిటెక్టర్లతో ఆటగాళ్లను పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో ప్లేయింగ్‌ హాల్‌లో నారాయణన్‌ను పరీక్షించినప్పుడు కాళ్ల దగ్గర బీప్‌ శబ్దం రావడంతో షూస్‌తో పాటు సాక్స్‌ను సైతం విప్పించారు. అయినా బీప్‌ ఆగలేదు. దీంతో అతడిని పక్కకు నిల్చోవాలని మరో ఆటగాడిని స్కానింగ్‌ చేయగా అప్పటికీ అదే శబ్దం వచ్చింది. అయితే ఫ్లోర్‌పై ఉన్న మ్యాట్‌ కింది నుంచే ఈ సౌండ్‌ వస్తుందని గమనించిన సిబ్బంది నారాయణన్‌కు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ హాల్‌లో అందరి ముందు అలా నిల్చోవాల్సి రావడం అవమానంగా భావించానని తను ఆవేదన చెందాడు.

Updated Date - 2022-11-29T01:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising