IndiaVsNewZealand: బ్యాటింగ్, బౌలింగ్‌లో దడ పుట్టించారు.. విజయం టీమిండియాదే..
ABN, First Publish Date - 2022-11-20T16:21:48+05:30
‘సూర్యప్రతాపం’తో బ్యాటింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంది. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలకుతోడు పేసర్లు మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు కూడా రాణించడంతో మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండవ టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది.
మౌంట్ మాంగనుయ్: ‘సూర్యప్రతాపం’తో బ్యాటింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంది. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలకుతోడు పేసర్లు మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు కూడా రాణించడంతో మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండవ టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. భారత్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కివీస్ బ్యాట్స్‌మెన్ చతికిలపడ్డారు. 18.5 ఓవర్లలో 126 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ 65 పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్లలో దీపక్ హుడా అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత చాహల్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. ఆ తర్వాత డెవోన్ కాన్వే 25 రెండవ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కాగా భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సెంచరీ వీరుడు సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది.
కివీస్ బ్యాటింగ్: ఫిన్ అలెన్ (0), డేవోన్ కాన్వే (25), కేన్ విలియమ్సన్ (61), గ్లెన్ ఫిలిప్ (12), డ్యారీ మిచెల్ (10), జేమ్స్ నీషమ్ (0), మిచెల్ శాంట్నర్ (0), ఆడమ్ మిల్నే (6), ఇషా సోధీ (1), టిమ్ సౌథీ (0), లూకీ ఫెర్గూసన్ (1 నౌటౌట్) చొప్పున పరుగులు చేశారు.
భారత్ బ్యాటింగ్..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ బౌలర్లపై సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. ఏడు సిక్స్‌లు, 11 ఫోర్లతో 51 బంతుల్లోనే 111 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ ఓపెనర్‌గా దిగి ఆరు పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 36, పంత్ 6, సూర్యకుమార్ యాదవ్ 111 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 13, దీపక్ హుడా 0, వాషింగ్టన్ సుందర్ 0, భువనేశ్వర్ కుమార్ 1 నాటౌట్ చొప్పున పరుగులు చేశారు.
Updated Date - 2022-11-20T16:39:54+05:30 IST