ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐవోఏ అథ్లెట్ల కమిషన్‌కు మేరీ, సింధు ఎన్నిక

ABN, First Publish Date - 2022-11-15T02:09:05+05:30

భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అథ్లెట్ల కమిషన్‌కు పీవీ సింధు, మేరీ కోమ్‌, ఆచంట శరత్‌కమల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అథ్లెట్ల కమిషన్‌కు పీవీ సింధు, మేరీ కోమ్‌, ఆచంట శరత్‌కమల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవమైన 10 మంది సభ్యులను రిటర్నింగ్‌ అధికారి ఉమేష్‌ సిన్హా ప్రకటించారు. వింటర్‌ ఒలింపియన్‌ శివ కేశవన్‌, లిఫ్టర్‌ మీరాబాయి చాను, మాజీ షూటర్‌ గగన్‌ నారంగ్‌, హాకీ స్టార్‌ రాణీ రాంపాల్‌, ఫెన్సర్‌ భవానీ దేవి, రోయర్‌ బజరంగ్‌ లాల్‌, మాజీ షాట్‌పుటర్‌ ఓపీ కర్హానా ఎన్నికయిన మిగిలిన ఏడుగురు సభ్యులు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) సభ్యుడి హోదాలో అభినవ్‌ బింద్రా, ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ సభ్యుడి హోదాలో సర్దార్‌ సింగ్‌లతో 12 మంది సభ్యుల కమిటీ పూర్తవుతుంది. ఐవోఏ కొత్త రాజ్యాంగం ప్రకారం అథ్లెట్ల కమిషన్‌లో పురుషులు, మహిళలకు సమాన ప్రాతినిథ్యం ఉండనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 10న ఐవోఏ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. రిటైర్డ్‌ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు.. ఐవోఏ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించారు.

Updated Date - 2022-11-15T02:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising