ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తోక’తో కొట్టారు

ABN, First Publish Date - 2022-12-05T03:39:03+05:30

మూడు వన్డేల సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియాకు ఝలక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌ స్పిన్నర్లు షకీబల్‌ (5/36), ఎబదోత్‌ హుస్సేన్‌ (4/47) ధాటికి స్టార్లతో కూడిన భారత పటిష్ట లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. కేఎల్‌ రాహుల్‌ (

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెహిదీ హసన్‌ వీరోచిత పోరాటం

ఆఖరి వికెట్‌కు 51 పరుగులు

తొలి వన్డేలో భారత్‌కు బంగ్లా షాక్‌

వన్డేలు ఆదరణ కోల్పోతున్నాయనే వారికి చెంపపెట్టుగా నిలుస్తుందేమో ఈ మ్యాచ్‌. పోరాడితే పోయేదేమీ లేదనే కసితో బంగ్లాదేశ్‌ చివరి బ్యాటర్లు చూపిన అసమాన ఆటతీరు వహ్వా.. అనిపించక మానదు. కేవలం 187 పరుగుల లక్ష్య ఛేదనలో 136 రన్స్‌కే తొమ్మిది వికెట్లు కోల్పోయిన బంగ్లా.. ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని ఊహించారా? కానీ ముస్తాఫిజుర్‌ను అండగా మెహిదీ హసన్‌ మిరాజ్‌ ఆడిన ఆటకు భారత బౌలర్లు బిత్తరపోయారు. ఆఖరి వికెట్‌కు ఏకంగా 51 రన్స్‌ జోడించి ఆతిథ్య జట్టుకు హసన్‌ అపురూప విజయాన్నందించాడు.

ఢాకా: మూడు వన్డేల సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియాకు ఝలక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌ స్పిన్నర్లు షకీబల్‌ (5/36), ఎబదోత్‌ హుస్సేన్‌ (4/47) ధాటికి స్టార్లతో కూడిన భారత పటిష్ట లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. కేఎల్‌ రాహుల్‌ (70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73) ఒంటరి పోరాటం చేశాడు. ఛేదనలో బంగ్లా 9 వికెట్లు కోల్పోయినా కావాల్సినన్ని బంతులు ఉండడం ఆ జట్టుకు లాభించింది. మెహిదీ హసన్‌ (39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్‌) ఒత్తిడి లేకుండా ఆడి బంగ్లాను వికెట్‌ తేడాతో గట్టెక్కించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్‌లో రోహిత్‌ (27), ధవన్‌ (7), కోహ్లీ (9) విఫలం కాగా మిడిలార్డర్‌లో స్పిన్నర్ల ధాటికి 4 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోవడం జట్టు స్కోరుపై ప్రభావం పడింది. వాషింగ్టన్‌ సుందర్‌ (19) కాసేపు నిలబడ్డాడు. ఛేదనలో బంగ్లా 46 ఓవర్లలో 187/9 స్కోరు చేసి గెలిచింది. లిట్టన్‌ దాస్‌ (41), షకీబల్‌ (29) అండగా నిలిచారు. సిరాజ్‌కు 3, కుల్దీప్‌.. సుందర్‌లకు రెండేసి వికెట్లు దక్కా యి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మెహిదీ నిలిచాడు. పంత్‌కు సిరీస్‌ నుంచి రెస్టివ్వగా.. కుల్దీప్‌ సేన్‌ అరంగేట్రం చేశాడు. కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ చేశాడు.

పట్టు వదల్లేదు..: 187 పరుగుల స్వల్ప ఛేదనలో తొలి బంతికే బంగ్లా వికెట్‌ కోల్పోయింది. తర్వాత కూడా భారత బౌలర్ల ధాటికి వీరి బ్యాటింగ్‌ సవ్యంగా సాగలేదు. కెప్టెన్‌ లిట్టన్‌ మాత్రం ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. షకీబల్‌తో కలిసి మూడో వికెట్‌కు 48 రన్స్‌ జోడించాడు. 35వ ఓవర్‌ నుంచి బౌలర్లు చెలరేగడంతో 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయింది. ఇక 51 రన్స్‌ చేయాల్సి ఉండగా మరో వికెట్‌ పడితే బంగ్లా ఓటమి ఖాయం. ఈ దశలో క్రీజులో ఉన్న మెహిదీ ఆశ వదులుకోలేదు. అతడికి ముస్తాఫిజుర్‌ (10 నాటౌట్‌) అండగా నిలవడం కలిసొచ్చింది. కానీ స్కోరు 155 వద్ద ఉన్నప్పుడు 43వ ఓవర్‌లో మోహిదీ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ అప్పుడే ముగిసిపోయేది. ఆ తర్వాతి ఓవర్‌లోనే మెహిదీ 3 ఫోర్లు బాది.. మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. మరో రెండు ఓవర్లలో 14 రన్స్‌ సాధించిన ఈ జోడీ రోహిత్‌ సేనకు దిమ్మ తిరిగేలా చేశారు.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (బి) షకీబల్‌ 27; ధవన్‌ (బి) మెహిదీ 7; కోహ్లీ (సి) లిట్టన్‌ (బి) షకీబల్‌ 9; శ్రేయాస్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ఎబదోత్‌ 24; రాహుల్‌ (సి) అనముల్‌ (బి) ఎబదోత్‌ 73; సుందర్‌ (సి) ఎబదోత్‌ (బి) షకీబల్‌ 19; షాబాజ్‌ (సి) షకీబల్‌ (బి) ఎబదోత్‌ 0; శార్దూల్‌ (బి) షకీబల్‌ 2; చాహర్‌ (ఎల్బీ) షకీబల్‌ 0; సిరాజ్‌ (సి) మహ్ముదుల్లా (బి) ఎబదోత్‌ 9; కుల్దీప్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 41.2 ఓవర్లలో 186 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-23, 2-48, 3-49, 4-92, 5-152, 6-153, 7-156, 8-156, 9-178, 10-186. బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 7-1-19-0; హసన్‌ 7-1-40-0; మెహిదీ 9-1-43-1; షకీబల్‌ 10-2-36-5; ఎబదోత్‌ 8.2-0-47-4.

బంగ్లాదేశ్‌: షంటో (సి) రోహిత్‌ (బి) చాహర్‌ 0; లిట్టన్‌ (సి) రాహుల్‌ (బి) సుందర్‌ 41; అనముల్‌ (సి) సుందర్‌ (బి) సిరాజ్‌ 14; షకీబల్‌ (సి) కోహ్లీ (బి) సుందర్‌ 29; ముష్ఫికర్‌ (బి) సిరాజ్‌ 18; మహ్ముదుల్లా (ఎల్బీ) శార్దూల్‌ 14; ఆఫిఫ్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్దీప్‌ 6; మెహిదీ (నాటౌట్‌) 38; ఎబదోత్‌ (హిట్‌ వికెట్‌) కుల్దీప్‌ 0; హసన్‌ (ఎల్బీ) సిరాజ్‌ 0; ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 46 ఓవర్లలో 187/9. వికెట్ల పతనం: 1-0, 2-26, 3-74, 4-95, 5-128, 6-128, 7-134, 8-135, 9-136. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 8-1-32-1; సిరాజ్‌ 10-1-32-3; కుల్దీప్‌ సేన్‌ 5-0-37-2; షాబాజ్‌ 9-0-39-0; సుందర్‌ 5-0-17-2; శార్దూల్‌ 9-1-21-1.

Updated Date - 2022-12-05T03:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising