ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FIFA Final Argentina : మెస్సీ మెరిసె... అల్వరెజ్‌ అదిరె..

ABN, First Publish Date - 2022-12-15T02:57:49+05:30

మ్యాచ్‌ ముందు వరకు అర్జెంటీనా విజయంపై ఎక్కడో అనుమానం. మరోవైపు బ్రెజిల్‌నే ఇంటికి పంపి కసిగా కనిపిస్తున్న క్రొయేషియా. విశ్లేషకుల అంచనాలు కూడా మోద్రిచ్‌ అండ్‌ కో వైపే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫైనల్లో అర్జెంటీనా

సెమీస్‌లో 0-3తో క్రొయేషియా చిత్తు

చెదిరిన మోద్రిచ్‌ కల

ఫిఫా ప్రపంచకప్‌

మ్యాచ్‌ ముందు వరకు అర్జెంటీనా విజయంపై ఎక్కడో అనుమానం. మరోవైపు బ్రెజిల్‌నే ఇంటికి పంపి కసిగా కనిపిస్తున్న క్రొయేషియా. విశ్లేషకుల అంచనాలు కూడా మోద్రిచ్‌ అండ్‌ కో వైపే..! కానీ, బరిలోకి దిగిన తర్వాత అవన్నీ పటాపంచలయ్యాయి. మెస్సీ, అల్వరెజ్‌ జోడీ ముందు.. క్రొయేషియా వెలవెల బోయింది. జీవితకాల ఫామ్‌లో ఉన్న మెస్సీ ఓ గోల్‌ చేయగా.. మరో గోల్‌కు బాటలు వేశాడు. రెండు గోల్స్‌తో అల్వరెజ్‌ పిడుగులా విరుచుకుపడ్డాడు. దీంతో అదరగొట్టే విజయాన్ని సొంతం చేసుకొన్న అర్జెంటీనా.. ఆరోసారి వరల్డ్‌కప్‌ తుదిపోరుకు దూసుకెళ్లింది. చిరకాల స్వప్నం విశ్వకప్‌ను ముద్దాడేందుకు మెస్సీ అడుగు దూరంలో నిలిచాడు.

లుసెయిల్‌ (ఖతార్‌): నయా బుల్లెట్‌ జూలియన్‌ అల్వరెజ్‌ డబుల్‌ ధమాకా.. ఎప్పటిలాగే లియోనెల్‌ మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0తో గత టోర్నీ ఫైనలిస్ట్‌ క్రొయేషియాను చిత్తు చేసింది. అల్వరెజ్‌ (39వ, 69వ) రెండు గోల్స్‌ చేయగా.. మెస్సీ (34వ) ఓ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. మ్యాచ్‌లో అందరి దృష్టీ మెస్సీపైనే ఉన్నా.. మైదానంలో మెరుపు వేగంతో కదులుతూ క్రొయేషియా కప్పు కలను భగ్నం చేసింది మాత్రం అల్వరెజే..! అర్జెంటీనా చేసిన మూడు గోల్స్‌లోనూ మెస్సీ, అల్వరెజ్‌ భాగస్వామ్యం ఉండడం విశేషం. గత మ్యాచ్‌ల్లో కొంత ఉదాసీనంగా కనిపించిన అర్జెంటీనా డిఫెన్స్‌.. ఈసారి మాత్రం లూకా మోద్రిచ్‌ సేన దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. సెమీ్‌సలో ఓడిన క్రొయేషియా మూడో స్థానం కోసం పోటీపడనుండగా.. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌ కోసం లాటిన్‌ అమెరికా జట్టు సిద్ధం కానుంది. దాదాపుగా చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న క్రొయేషియా కెప్టెన్‌ లూకా మోద్రిచ్‌ విశ్వకప్‌ కల చెదిరింది.

జూలియన్‌ మెరుపు దాడి

మేటి జట్టు బ్రెజిల్‌ను ఓడించిన క్రొయేషియా.. ఒకరకంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగా మ్యాచ్‌ మొత్తంలో బంతిని ఎక్కువ శాతం నియంత్రణలో ఉంచుకొంది. దాడుల పరంగానూ మెరుగ్గానే కనిపించింది. కానీ, బుల్లెట్‌ దించింది మాత్రం అల్వరెజ్‌. ఫస్టాఫ్‌ ఆరంభం నుంచే మోద్రిచ్‌ అండ్‌ కో వరుసగా దాడులతో అర్జెంటీనాను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. 11వ నిమిషంలో స్ట్రయికర్‌ పెరిసిచ్‌ నేతృత్వంలో అర్జెంటీనాపై ఎటాక్‌ చేసినా.. రొమేరో అప్రమత్తతతో దాన్ని తప్పించాడు. అయితే, 32వ నిమిషంలో లాంగ్‌ పాస్‌ను అందుకొన్న అల్వరెజ్‌.. మెరుపు వేగంతో క్రొయేషియా గోల్‌పైకి దండయాత్ర చేశాడు. కానీ, పెనాల్టీ బాక్స్‌లో కీపర్‌ లివకోవిచ్‌.. అతడిని పడేయడంతో సమీక్షించిన రెఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీన్ని మెస్సీ పవర్‌ఫుల్‌ కిక్‌తో గోల్‌లోకి పంపి జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఇది జరిగిన ఐదు నిమిషాలకు అల్వరెజ్‌ వన్‌మ్యాన్‌ ఆర్మీ తరహాలో దాడి చేసి క్రొయేషియాకు దిమ్మదిరిగే షాకిచ్చాడు. అర్జెంటీనా హాఫ్‌లో మెస్సీ పాస్‌ను దొరకబుచ్చుకొన్న అల్వరెజ్‌.. ముగ్గురు ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకుంటూ బంతిని గోల్‌లోకి పంపి జట్టును 2-0 ఆధిక్యంలో నిలిపాడు. దీంతో ఫస్టా్‌ఫలోనే మ్యాచ్‌ మెస్సీ సేనవైపు మొగ్గింది. 45వ నిమిషంలో క్రొయేషియా పదునైన దాడి చేసినా.. పసాలిక్‌ ఆఫ్‌సైడ్‌ కావడంతో అర్జెంటీనా ఊపిరి పీల్చుకొంది.

మెస్సీ అద్భుత డ్రిబ్లింగ్‌..

సెకండా్‌ఫలో గోల్‌ చేసేందుకు క్రొయేషియా కూడా పట్టువీడకుండా ప్రయత్నాలు చేసింది. 62వ నిమిషంలో ఫ్రీకిక్‌ రూపంలో సువర్ణావకాశం లభించినా.. గోల్‌ లైన్‌ ముందు అర్జెంటీనా డిఫెండర్‌ దాన్ని బయటకు కొట్టాడు. మరో 7 నిమిషాల తర్వాత మెస్సీ అద్భుత డ్రిబ్లింగ్‌తో క్రొయేషియా బెస్ట్‌ డిఫెండర్‌ ఓస్కో కాళ్ల మధ్య నుంచి ఇచ్చిన పాస్‌ను అల్వరెజ్‌.. ఏమాత్రం పొరపాటు చేయకుండా నెట్‌లోకి కొట్టడంతో అర్జెంటీనా 3-0 ఆధిక్యంలో గెలుపును ఖరారు చేసుకొంది.

  • 1958 వరల్డ్‌కప్‌లో 17 ఏళ్ల వయసులో బ్రెజిల్‌ దిగ్గజం పీలే హ్యాట్రిక్‌ తర్వాత.. సెమీస్‌లో డబుల్‌ గోల్స్‌ చేసిన పిన్నవయ స్కుడిగా 22 ఏళ్ల అల్వరెజ్‌.

  • అర్జెంటీనా తరఫున ప్రపంచకప్‌లో అత్యధికంగా 11 గోల్స్‌ చేసిన ఆటగాడిగా మెస్సీ.

  • వరల్డ్‌కప్‌లో ఆరోసారి సెమీఫైనల్‌ ఆడిన అర్జెంటీనా.. ఒక్కసారి కూడా ఓడలేదు.

ఇదే నా చివరి వరల్డ్‌కప్‌: మెస్సీ

ఇదే తన చివరి ప్రపంచకప్‌ అని లియోనెల్‌ మెస్సీ ప్రకటించాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన 35 ఏళ్ల లియోనెల్‌.. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో విశ్వక్‌పనకు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు. ‘నా ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ఫైనల్‌ మ్యాచ్‌తో ముగిస్తాను. ఇప్పటి వరకు సాధించిన విజయాలపట్ల ఎంతో ఆనందంగా ఉన్నా. మరో ప్రపంచకప్‌ వరకు ఆడగలనని అనుకోవడం లేదు. ఇలాంటి సమయంలోనే గుడ్‌బై చెప్పడం బెస్ట్‌’ అని మెస్సీ అన్నాడు.

Updated Date - 2022-12-15T02:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising