ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FIFA World Cup : క్వార్టర్స్‌కు నెదర్లాండ్స్‌

ABN, First Publish Date - 2022-12-04T00:31:45+05:30

ఆద్యంతం అద్భుత ఆటను ప్రదర్శించిన నెదర్లాండ్స్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన రౌండ్‌-16లో నెదర్లాండ్స్‌ 3-1తో అమెరికాపై సాధికార విజయం సాధించింది.

గోల్‌ చేసిన ఆనందంలో సహచరుడితో డచ్‌ ఆటగాడు డెంజల్‌ డమ్‌ఫ్రైస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3-1తో అమెరికాపై విజయం

అదరగొట్టిన డమ్‌ఫ్రైస్‌

అల్‌ రయాన్‌ (ఖతార్‌): ఆద్యంతం అద్భుత ఆటను ప్రదర్శించిన నెదర్లాండ్స్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన రౌండ్‌-16లో నెదర్లాండ్స్‌ 3-1తో అమెరికాపై సాధికార విజయం సాధించింది. మెంఫిస్‌ డిపే (10వ), డాలీ బ్లైండ్‌ (45+1), డెంజల్‌ డమ్‌ఫ్రైస్‌ (81వ) గోల్స్‌ చేయగా.. అమెరికా తరఫున హజీ రైట్‌ (76వ) ఏకైక గోల్‌ సాధించాడు. రెండు గోల్స్‌కు బాటలు వేసిన డమ్‌ఫ్రైస్‌.. మూడో గోల్‌ చేసి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చా డు. ఈ ఓటమితో అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఫస్టా్‌ఫలోనే రెండు గోల్స్‌: మ్యాచ్‌ ఆరంభమైన మూడో నిమిషంలో అమెరికా స్టార్‌ ఫులిసెక్‌కు సువర్ణావకాశం లభించింది. కానీ, అతడు కొట్టిన కిక్‌ను డచ్‌ కీపర్‌ నోపర్‌ అడ్డుకొన్నాడు. కానీ, క్రమంగా ఒత్తిడి పెంచిన ఆరెంజ్‌ ఆర్మీ 10వ నిమిషంలో మెంఫిస్‌ డిపే గోల్‌తో పైచేయి సాధించింది. డమ్‌ఫ్రైస్‌ ఇచ్చిన లోపా్‌సను డిపే నేరుగా గోల్‌లోకి కొట్టాడు. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించినా.. డచ్‌ డిఫెన్స్‌ను ఏమార్చలేక పోయింది. మ్యాచ్‌ సాగేకొద్దీ బంతిని ఎక్కువగా తమ అధీనంలోనే ఉంచుకొన్న నెదర్లాండ్స్‌.. యూఎ్‌సను ఆత్మరక్షణలో పడేసింది. ఫస్టాఫ్‌ స్టాపేజ్‌ (45+1) టైమ్‌లో మరో గోల్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈసారి డమ్‌ఫ్రైస్‌ పాస్‌ను బ్లైండ్‌ నెట్‌లోకి పంపడంతో నెదర్లాండ్స్‌ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, సెకండా్‌ఫలో అమెరికన్లు దూకుడు పెంచినా.. నెదర్లాండ్స్‌ను వణికించేంత రీతిలో సాగలేదు. ఆరంభమైన ఐదు నిమిషాలకే డచ్‌ ప్లేయర్‌ డమ్‌ఫ్రైస్‌ గోల్‌ చేసినంత పని చేశాడు. యూఎస్‌ పెనాల్టీ ఏరియాలో అతడు కొట్టిన కిక్‌ను జిమ్మర్‌మెన్‌ ఆపే ప్రయత్నంలో తడబడినా.. కీపర్‌ టర్నర్‌ లిప్తపాటులో బంతిని అడ్డుకున్నాడు. అయితే, 75వ నిమిషంలో అమెరికా గోల్‌ చేసింది. ఫులిసెక్‌ క్రాస్‌.. రైట్‌ కాలికి తగిలి గోల్‌లో పడింది. ఇదే జోరులో యూఎస్‌ మరిన్ని దాడులు చేసినా.. 81వ నిమిషంలో బ్లైండ్‌ ఇచ్చిన క్రాస్‌ను డమ్‌ఫ్రైస్‌ గోల్‌లోకి పంపడంతో నెదర్లాండ్స్‌ 3-1తో నిలిచింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటూ ముందంజ వేసింది.

Updated Date - 2022-12-04T00:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising