Messi's Golden Boots: మెస్సి వాడుతున్న బూట్ల ప్రత్యేకత ఏంటో తెలిస్తే.. వావ్ అనాల్సిందే!
ABN, First Publish Date - 2022-11-27T12:59:04+05:30
సాకర్ ప్రపంచంలో అసలు పరిచయమే అక్కర్లేని పేరు లియోనెల్ మెస్సి (Lionel Messi). ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నో రికార్డులు అతని సొంతం.
ఇంటర్నెట్ డెస్క్: సాకర్ ప్రపంచంలో అసలు పరిచయమే అక్కర్లేని పేరు లియోనెల్ మెస్సి (Lionel Messi). ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నో రికార్డులు అతని సొంతం. ప్రస్తుతం ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో (FIFA World Cup-2022) అర్జెంటీనా సారథిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు 4 వరల్డ్‌కప్‌లు ఆడిన మెస్సి.. అన్నింటీలో గోల్ చేసిన ఆటగాడిగా కూడా రికార్డుకెక్కారు. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓడిన కానీ.. మెస్సి మాత్రం ఒక గోల్‌తో అభిమానులను అలరించాడు. ఇక శనివారం నాటి మెక్సికో మ్యాచ్‌లో కూడా ఈ సాకర్ వీరుడు అద్భుతమే చేశాడు. కళ్లు చెదిరే ఓ గోల్‌తో జట్టుకు అధిక్యాన్ని అందించాడు. చివరకు మెస్సీ సేన ఈ మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విక్టరీతో అర్జెంటీనా 3 పాయింట్లు తన ఖాతాలో వేసుకుని రౌండ్-16 ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇదిలాఉంటే.. ఈ ప్రపంచకప్‌లో మెస్పీ వాడుతున్న గోల్డెన్ బూట్లు (Golden Boots) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ బూట్ల తాలూకు ఫొటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. వాటికి ఓ ప్రత్యేకత కూడా ఉందండోయ్. అది తెలిస్తే వావ్ అనాల్సిందే. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి వాడుతున్న ఈ ప్రత్యేకమైన బూట్లను ఛాంపియన్స్ లీగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా 'మెస్సి ప్రపంచ కప్ బూట్లు' (Messi's World Cup boots) పేరిట అభిమానులతో పంచుకుంది. ప్రముఖ షూ తయారీ కంపెనీ అడిడాస్ వీటిని చాతా ప్రత్యేకంగా తీర్చిదిద్దిందనే చెప్పాలి. చూడగానే ఇట్టే ఆకట్టుకుంటున్న ఈ బూట్ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. తన కుమారుల పుట్టిన తేదీలు, పేర్లతో ప్రత్యేకంగా పసిడిని ఉపయోగించి వీటిని రూపొందించడం జరిగింది. కుడి బూటుకు మెస్సి ఇద్దరు కుమారులు థియాగో, మాటియో పేర్లు.. వారి బర్త్‌డే వివరాలు ఉన్నాయి. 'థియాగో 02 11 12', 'మాటియో 11 09 15' అని కుడి బూటుపై ఉంది. అలాగే ఎడమ బూటుపై మూడో కుమారుడు సిరో పేరు, పుట్టిన తేదీతో పాటు మెస్సి భార్య ఆంటోనెల్లా పేరు కూడా ఉంది. అంతేగాక ఈ రెండు బూట్లకు గోల్డ్ పట్టిలను ప్రత్యేక ఆకారంలో అమర్చడం జరిగింది. ఇవి ఆ బూట్లకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అర్జెంటీనా జాతీయ జెండాలోని ఓసియన్ బ్లూ, వైట్ కలర్స్‌తో వీటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దింది అడిడాస్ కంపెనీ. దాంతో ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు వీటి తాలూకు ఫొటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరు మెస్సి గోల్డెన్ బూట్లపై ఓ లుక్కేయండి.
Updated Date - 2022-11-27T14:09:49+05:30 IST