రహానె, ఇషాంత్ అవుట్!
ABN, First Publish Date - 2022-12-13T03:28:28+05:30
ఫామ్ కోల్పోయిన టెస్టు స్పెషలిస్టులు అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలను బీసీసీఐ తమ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించనుంది. అలాగే ఇప్పటికే టీమ్‌కు దూరమైన
గిల్, సూర్యకు ప్రమోషన్
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఫామ్ కోల్పోయిన టెస్టు స్పెషలిస్టులు అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలను బీసీసీఐ తమ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించనుంది. అలాగే ఇప్పటికే టీమ్‌కు దూరమైన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సైతం తొలగింపు జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఈనెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానుండగా, 2022-23కి సంబంధించిన పురుషుల, మహిళల కాంట్రాక్ట్ లిస్ట్‌ను కూడా ఆమోదించనున్నారు. ఇక భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా భావిస్తున్న హార్దిక్ పాండ్యాతోపాటు సూర్యకుమార్, గిల్‌లను ‘సి’ నుంచి ‘బి’ మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.
Updated Date - 2022-12-13T03:30:27+05:30 IST