ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ishan Kishan : ఇషాన్‌దార్

ABN, First Publish Date - 2022-12-11T00:52:27+05:30

ఆహా.. ఇలా కదా టీమిండియా ఆడాల్సింది. సిరీస్‌ ఇప్పటికే పోతేనేం.. ఆఖరి వన్డేలో బంగ్లా బేబీలను బెంబేలెత్తించింది. ముఖ్యంగా రోహిత్‌ స్థానంలో బరిలోకి దిగిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ నమ్మశక్యం కాని రీతిలో చెలరేగాడు. తుది జట్టులో చోటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫాస్టెస్ట్‌ డబుల్‌తో రికార్డు

కోహ్లీ శతకం

భారత్‌ ఘన విజయం

విరాట్‌ 91 బంతుల్లో 113 రన్స్‌

131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210

ఆహా.. ఇలా కదా టీమిండియా ఆడాల్సింది. సిరీస్‌ ఇప్పటికే పోతేనేం.. ఆఖరి వన్డేలో బంగ్లా బేబీలను బెంబేలెత్తించింది. ముఖ్యంగా రోహిత్‌ స్థానంలో బరిలోకి దిగిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ నమ్మశక్యం కాని రీతిలో చెలరేగాడు. తుది జట్టులో చోటు దక్కాలే కానీ చెలరేగి పోనూ.. అన్నట్టుగా కళ్లు చెదిరే షాట్లతో అతడు విజృంభించడంతో చిట్టగాంగ్‌ స్టేడియంలో పరుగుల వరదే పారింది. 85 బంతుల్లో శతకం.. 103 బంతుల్లో 150 ఇలా టీ20 తరహా పవర్‌ హిట్టింగ్‌తో బ్యాట్‌ ఝుళిపించిన ఇషాన్‌.. వన్డే చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ (126 బంతుల్లోనే) డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు. ఇక విరాట్‌ సైతం మూడేళ్ల తర్వాత వన్డే సెంచరీతో పరుగుల కొరతను తీర్చేసుకోవడంతో భారత్‌కు వైట్‌వాష్‌ ప్రమాదం తప్పింది.

చిట్టగాంగ్‌: మూడు వన్డేల సిరీ్‌సలో భారత్‌ తొలిసారి స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) వన్డేల్లో అరుదైన ద్విశతకం సాధించగా.. అటు విరాట్‌ కోహ్లీ (91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) సైతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ చివరి మూడో వన్డేలో భారత్‌ 227 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. రెండో వికెట్‌కు ఇషాన్‌-విరాట్‌ జోడీ ఏకంగా 290 పరుగులు జోడించింది. ఇందులో ఇషాన్‌వే 199 రన్స్‌ ఉన్నాయి. అయితే సిరీస్‌ను మాత్రం ఆతిథ్య జట్టు 2-1తో గెలుచుకుంది. భారత్‌ తమ చివరి పర్యటన (2015)లోనూ ఇక్కడ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగుల భారీ స్కోరు చేసింది. టస్కిన్‌, ఎబాదత్‌, షకీబల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బంగ్లాదేశ్‌ 34 ఓవర్లలో 182 పరుగులు చేసి ఓడిపోయింది. షకీబల్‌ (43), లిట్టన్‌ దాస్‌ (29) మాత్రమే రాణించారు. శార్దూల్‌కు 3, అక్షర్‌.. ఉమ్రాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇషాన్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా మెహిదీ హసన్‌ నిలిచారు.

పోరాడకుండానే..: కష్టసాధ్యమైన 410 పరుగుల భారీ ఛేదనలో బంగ్లా ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. ఆరంభంలో కాస్త వేగంగా ఆడినా మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. షకీబల్‌ మాత్రమే ఓ మాదిరిగా ఆడాడు. నాలుగో వికెట్‌కు తను యాసిర్‌ (25)తో కలిసి అందించిన 34 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. కుల్దీప్‌ యాదవ్‌ చేతిలో షకీబల్‌ బౌల్డ్‌ కావడంతో ఆ తర్వాత బంగ్లా పతనం లాంఛనమే అయ్యింది.

ఇషాన్‌ మాస్‌-విరాట్‌ క్లాస్‌ : టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌

తొలి ఐదు ఓవర్లలో చేసింది 15 పరుగులే. అప్పటికే ఓపెనర్‌ ధవన్‌ (3) కూడా అవుటయ్యాడు. కానీ ఆ తర్వాత మరో వికెట్‌ తీసేందుకు బంగ్లా బౌలర్లు 36వ ఓవర్‌ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఓపెనర్‌ ఇషాన్‌ సాగించిన విధ్వంసానికి వారంతా ప్రేక్షకపాత్ర పోషించారు. అతడి మాస్‌.. విరాట్‌ క్లాస్‌ ఆటతీరుకు స్టేడియం దద్దరిల్లింది. అయితే ఈ ఇద్దరు పెవిలియన్‌ చేరాక చివరి పది ఓవర్లలో జట్టు 70 పరుగులే సాధించింది. లేకుంటే 450-500 స్కోరు కూడా సాధ్యమయ్యేదే. 12వ ఓవర్‌లో ఇషాన్‌ 4,4,6,4తో బ్యాట్‌కు పనిజెప్పాడు. 85 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకం పూర్తి చేసిన ఇషాన్‌ ఆ తర్వాత గేరు మార్చి కొడితే సిక్సర్‌, లేకుంటే ఫోర్‌ అన్నట్టు విరుచుకుపడ్డాడు. దీంతో మరో 41 బంతుల్లోనే 100 రన్స్‌ చేసి తొలి డబుల్‌ సాధించాడు. ఆ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా భల్లే.. భల్లే డ్యాన్స్‌తో ఇషాన్‌ను ఆలింగనం చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే 36వ ఓవర్‌లో టస్కిన్‌ బంతికి తను అవుట్‌ కావడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. అప్పటికింకా 14 ఓవర్లు మిగిలి ఉండగా అవుట్‌ కాకపోయుంటే ఇషాన్‌ 300 కూడా దాటించేసేవాడేమో. ఫోర్లు, సిక్సర్ల ద్వారానే తను 156 పరుగులు రాబట్టడం విశేషం. ఇక శ్రేయాస్‌ (3), రాహుల్‌ (8) నిరాశపర్చగా.. కోహ్లీ మాత్రం 85 బంతుల్లో వన్డేల్లో 44వ శతకం పూర్తి చేశాడు. 42వ ఓవర్‌లో విరాట్‌ కూడా వెనుదిరగడంతో స్కోరు మందగించింది.

ట్రిపుల్‌ సెంచరీ చేసేవాణ్ణి

‘బ్యాటింగ్‌ చేసేందుకు వికెట్‌ చాలా సహకరించింది. బంతి కనిపిస్తే బాదాలన్న లక్ష్యంతో ఆడాను. భారత దిగ్గజాల సరసన నా పేరుండడం అదృష్టంగా భావిస్తున్నా. నేను అవుటయ్యే సమయానికి మరో 14 ఓవర్లున్నాయి. క్రీజులో ఉండివుంటే 300 కూడా కొట్టేవాణ్ణి. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేద్దామనుకున్నా.. కానీ కోహ్లీ సూచనతో సింగిల్స్‌ ద్వారా రాబట్టాను’

ఇషాన్‌ కిషన్‌

భారత్‌: ధవన్‌ (ఎల్బీ) మెహిదీ హసన్‌ 3; ఇషాన్‌ (సి) లిట్టన్‌ (బి) టస్కిన్‌ 210; కోహ్లీ (సి) మెహిదీ హసన్‌ (బి) షకీబల్‌ 113; శ్రేయాస్‌ (సి) లిట్టన్‌ (బి) ఎబాదత్‌ 3; రాహుల్‌ (బి) ఎబాదత్‌ 8; సుందర్‌ (బి) షకీబల్‌ 37; అక్షర్‌ (బి) టస్కిన్‌ 20; శార్దూల్‌ (సి) లిట్టన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 3; కుల్దీప్‌ (నాటౌట్‌) 3; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 50 ఓవర్లలో 409/8. వికెట్ల పతనం: 1-15, 2-305, 3-320, 4-344, 5-344, 6-390, 7-405, 8-409; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 10-0-66-1; టస్కిన్‌ 9-1-89-2; మెహిదీ హసన్‌ 10-0-76-1; ఎబాదత్‌ 9-0-80-2; షకీబల్‌ 10-0-68-2; అఫీఫ్‌ 1-0-14-0; మహ్ముదుల్లా 1-0-11-0.

బంగ్లాదేశ్‌: అనముల్‌ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 8; లిట్టన్‌ దాస్‌ (బి) శార్దూల్‌ (బి) సిరాజ్‌ 29; షకీబల్‌ (బి) కుల్దీప్‌ 43; ముష్ఫికర్‌ (బి) అక్షర్‌ 7; యాసిర్‌ అలీ (ఎల్బీ) ఉమ్రాన్‌ 25; మహ్ముదుల్లా (ఎల్బీ) సుందర్‌ 20; అఫీఫ్‌ (సి) ఉమ్రాన్‌ (బి) శార్దూల్‌ 8; మెహిదీ హసన్‌ (సి) సిరాజ్‌ (బి) శార్దూల్‌ 3; టస్కిన్‌ (నాటౌట్‌) 17; ఎబదోత్‌ (ఎల్బీ) శార్దూల్‌ 0; ముస్తాఫిజుర్‌ (బి) ఉమ్రాన్‌ 13; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 34 ఓవర్లలో 182 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-33, 2-47, 3-73, 4-107, 5-124, 6-143, 7-145, 8-148, 9-149, 10-182. బౌలింగ్‌: సిరాజ్‌ 5-0-27-1; శార్దూల్‌ 5-0-30-3; అక్షర్‌ 5-0-22-2; ఉమ్రాన్‌ 8-0-43-2; కుల్దీప్‌ 10-1-53-1; సుందర్‌ 1-0-2-1.

  • వన్డేల్లో తొలి సెంచరీనే డబుల్‌గా మలిచిన ఏకైక ఆటగాడిగా ఇషాన్‌

  • వన్డేల్లో అత్యంత వేగంగా 44 శతకాలు బాదిన ఆటగాడు విరాట్‌ (256 ఇన్నింగ్స్‌) వన్డేల్లో బంగ్లాదేశ్‌ ఇంత భారీ తేడాతో ఓడడం ఇదే తొలిసారి.

  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు (72) బాదిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ. పాంటింగ్‌ (71)ను అధిగమించగా, సచిన్‌ (100) టాప్‌లో ఉన్నాడు.

  • పరుగుల పరంగా భారత్‌కిది వన్డేల్లో మూడో భారీ విజయం

  • భారత్‌ తరఫున డబుల్‌ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా ఇషాన్‌. గతంలో రోహిత్‌ (3), సెహ్వాగ్‌, సచిన్‌ సాధించారు. ఓవరాల్‌గా ఏడో వాడు.

Updated Date - 2022-12-11T00:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising