ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL Auction: రూ.18.50 కోట్ల ధర పలకడంపై సామ్ కర్రాన్ ఏమన్నాడంటే..

ABN, First Publish Date - 2022-12-23T19:34:00+05:30

ఐపీఎల్ వేలం 2023లో (IPL Auction 2023) ఇంగ్లండ్ ఆల్‌-రౌండర్ సామ్ కర్రాన్ (Sam Curran) నయా చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ.18.50 కోట్ల భారీ మొత్తంతో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కొనుగోలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి: ఐపీఎల్ వేలం 2023లో (IPL Auction 2023) ఇంగ్లండ్ ఆల్‌-రౌండర్ సామ్ కర్రాన్ (Sam Curran) నయా చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ.18.50 కోట్ల భారీ మొత్తంతో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా సామ్ కర్రాన్ గత రికార్డులను చెరిపేశాడు. కర్రాన్‌కు భారీ డిమాండ్ ఉంటుందని అంతా ముందే భావించినా రికార్డ్ స్థాయికి దక్కించుకోవడం ఆసక్తికరం. కాగా ఐపీఎల్ వేలంలో తనను ఈ స్థాయి భారీ ధరకు కొనుగోలు చేయడంపై ట్విటర్ వేదికగా సామ్ కర్రాన్ తొలిసారి స్పందించాడు. ‘‘ ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే.. ఎదురుచూస్తున్నాను’’ అని వ్యాఖ్యానించాడు.

కాగా ఇదే పంజాబ్ కింగ్స్ తరపున సామ్ కర్రాన్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2019లో రూ.7.2 కోట్ల మొత్తంతో సామ్ కర్రాన్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో కర్రాన్ అద్భుతంగా రాణించాడు. విశ్వకప్‌ను ఇంగ్లండ్ ముద్దాడడంలో కీలక పాత్ర పోషించారు. వరల్డ్ కప్ మాత్రమే కాకుండా ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో ఆకర్షణీయ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది మొత్తం 14 టీ20 మ్యాచ్‌లు ఆడగా 7.08 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 27.07 సగటుతో 154.66 పరుగులు చేశాడు. అందుకే కర్రాన్ కోసం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్ తెగ పోటీపడ్డాయి. ముంబై ఇండియన్స్ కూడా రూ.18 కోట్లు చెల్లించేందుకు బిడ్ వేసింది. కానీ పంజాబ్ కింగ్స్ అంతకంటే ఎక్కువగా బిడ్ వేసి సామ్ కర్రాన్‌ను సొంతం చేసుకుంది.

Updated Date - 2022-12-23T19:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising