FIFA world cup: ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఒక స్టేడియాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా..
ABN, First Publish Date - 2022-12-04T22:00:17+05:30
ఎడారి దేశం ఖతార్ (Qatar) వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA world cup2022) రసవత్తరంగా కొనసాగుతోంది. రౌండ్ 16 మ్యాచ్‌లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మ్యాచ్‌లన్నీ 7 కొత్త స్టేడియాల వేదికగా జరుగుతున్నాయి.
దోహా: ఎడారి దేశం ఖతార్ (Qatar) వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA world cup2022) రసవత్తరంగా కొనసాగుతోంది. రౌండ్ 16 మ్యాచ్‌లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మ్యాచ్‌లన్నీ 7 కొత్త స్టేడియాల వేదికగా జరుగుతున్నాయి. ఈ స్టేడియాల్లో ఒకటైన ‘స్టేడియం 974’ (Stadium 974) వేదికను దోహా నగరంలో విభిన్నంగా నిర్మించారు. 40 వేల మంది వీక్షకులు మ్యాచ్ చూసే సామర్థ్యమున్న ఈ స్టేడియ టోర్నమెంట్ ముగిసిన తర్వాత కూల్చివేయనున్నారు. స్టీల్, షిప్పింగ్ కంటెయినర్స్ సహా రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో దీనిని పాక్షికంగా నిర్మించడమే ఇందుకు కారణంగా ఉంది. టోర్నీ ముగిశాక స్టేడియాన్ని పూర్తిగా కూల్చివేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. మెటీరియల్స్‌ను వేరుచేయనున్నట్టు చెప్పారు. ఈ సామాగ్రిని ఇతర దేశాలకు కూడా పంపించవచ్చని తెలిపారు. కాగా ‘స్టేడియం 974’ డిజైన్, మౌలిక సదుపాయాలపై ఖతార్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన నిపుణుల ప్రశంసలు దక్కాయి. అయితే ఎంత వరకు సక్సెస్ అయ్యామనే విషయం టోర్నమెంట్ ముగిసిన తర్వాత తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
సుస్థిరాభివృద్ధి అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ఈ స్టేడియాన్ని ఈ విధంగా నిర్మించామని చెప్పారు. వాడిన భాగాలన్నింటినీ వేరు చేసేవిధంగా నిర్మించినట్టు చతమ్ హౌస్ (Chatham House) కంపెనీ అసోసియేట్ అయిన కరీం ఎల్గెండీ చెప్పారు. కాగా ‘స్టేడియం 974’ నిర్మాణానికి 974 కంటెయినర్లను ఉపయోగించడంతో ఈ పేరు పెట్టారు. కాకపోతే అనుకోకుండా ఖతార్ డయలింగ్ కోడ్ కూడా 974 కావడం విశేషం.
Updated Date - 2022-12-04T22:00:45+05:30 IST