Fast Deliveries: టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ డెలివరీలు ఇవే!

ABN , First Publish Date - 2022-11-07T16:50:18+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో సూపర్-12 దశ ముగిసింది. ఇక మిగిలింది సెమీస్, ఫైనల్స్ మాత్రమే

Fast Deliveries: టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ డెలివరీలు ఇవే!

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో సూపర్-12 దశ ముగిసింది. ఇక మిగిలింది సెమీస్, ఫైనల్స్ మాత్రమే. బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య జరిగిన ఈ పోరులో కొన్నిసార్లు బ్యాటర్లు విజయం సాధిస్తే, మరికొన్ని సార్లు బౌలర్లు విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో సూపర్-12లో నమోదైన అత్యంత వేగవంతమైన పది బంతుల గురించి తెలుసుకుందాం. ఈ విషయంలో ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్( Mark Wood) రికార్డు స్పెల్‌తో అదరగొట్టాడు. వైట్‌బాల్ క్రికెట్‌లోనే అరుదైన రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వేసిన నాలుగు ఓవర్లలోనూ గంటకు 149.02 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బంతులు విసిరాడు. ఫలితంగా 2009లో విండీస్ ఆటగాడు ఫిడెల్ ఎడ్వర్డ్స్ సృష్టించిన రికార్డును తుడిచిపెట్టేశాడు.

అత్యంత వేగవంతమైన బంతులు విసిరింది వీరే

1. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్‌వుడ్ గంటకు 154.74 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఈ టోర్నీలోనే ఇది ఫాస్టెస్ట్ డెలివరీ.

2. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ 154.55 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరాడు.

3. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్‌వుడ్ వేసిన బంతి 154.48 కిలోమీటర్ల వేగాన్ని రికార్డు చేసింది.

4. అదే మ్యాచ్‌లో మరో బతిని కూడా అంతే వేగంతో వుడ్ సంధించాడు

5. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అన్రిక్ నోకియా 154.31 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరాడు.

6. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్‌వుడ్ సంధించిన బంతి 154.07 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది.

7. బంగ్లాదేశ్‌పై అన్రిక్ నోకియా సంధించిన బంతి 153.47 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

8. నెదర్లాండ్స్‌పై అన్రిక్ నోకియా 153.38 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని సంధించాడు.

9. న్యూజిలాండ్‌పై మార్క్‌వుడ్ 153.31 కిలోమీటర్ల వేగంతో బంతి వేశాడు.

10. శ్రీలంకపై మార్క్‌వుడ్ 153.17 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరాడు.

Updated Date - 2022-11-07T16:51:16+05:30 IST

Read more