ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలని..

ABN, First Publish Date - 2022-11-15T02:03:50+05:30

ఫిఫా వరల్డ్‌క్‌పలో హాట్‌ ఫేవరెట్‌ టీమ్‌ అంటే.. సాకర్‌ అభిమానులు తడుముకోకుండా చెప్పేది బ్రెజిల్‌. ఇరవై ఏళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన సాంబా జట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిఫా వరల్డ్‌క్‌పలో హాట్‌ ఫేవరెట్‌ టీమ్‌ అంటే.. సాకర్‌ అభిమానులు తడుముకోకుండా చెప్పేది బ్రెజిల్‌. ఇరవై ఏళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన సాంబా జట్టు.. కతార్‌లో ఈనెల 20 నుంచి జరిగే విశ్వక్‌పలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది. బ్రెజిల్‌ ఉండగా, గ్రూప్‌-బిలో అగ్రస్థానంపై ఆశలు లేకపోయినా.. రెండో స్థానంతో నాకౌట్‌ చేరుకోవాలని సెర్బియా, స్విట్జర్లాండ్‌, కామెరూన్‌లో పోటీపడనున్నాయి.

బ్రెజిల్‌: ఐదుసార్లు సాకర్‌ విశ్వవిజేతగా నిలిచిన జట్టు బ్రెజిల్‌. 1930 నుంచి జరిగిన అన్ని ప్రపంచక్‌పలలోనూ పాల్గొన్న ఏకైక జట్టు. 1982 నుంచి వరుసగా నాకౌట్‌కు చేరుతూ సత్తాచాటుతోంది. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగితున్న బ్రెజిల్‌.. గ్రూప్‌ టాపర్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2002లో కొరియాలో జరిగిన వరల్డ్‌క్‌పలో జర్మనీపై గెలిచి విశ్వవిజేతగా నిలిచిన బ్రెజిల్‌.. రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలకాలనుకుంటోంది. అయితే, గత నాలుగు వరల్డ్‌క్‌పల్లో బ్రెజిల్‌ ఒక్కసారి మాత్రమే సెమీస్‌ చేరి.. నాలుగో స్థానంతో సరిపెట్టుకొంది. దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్‌లో ఆడిన 17 మ్యాచ్‌ల్లో 14 నెగ్గిన బ్రెజిల్‌పై భారీ అంచనాలున్నాయి.

కీలక ఆటగాళ్లు: నెమార్‌, వినెనియస్‌ జూనియర్‌, రిచర్‌లైసన్‌, రఫీనా;

ఫిఫా ర్యాంక్‌: 1; అంచనా: గ్రూప్‌ టాపర్‌.

సెర్బియా: స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత.. గత మూడు మెగా టోర్నీల్లోనూ సెర్బియా గ్రూప్‌ దశ దాటలేదు. 2018లో రష్యాలో జరిగిన వరల్డ్‌క్‌పలో బ్రెజిల్‌, స్విట్జర్లాండ్‌ చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. మరోసారి మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో.. ఈసారి నాకౌట్‌కు చేరాలనే లక్ష్యంగా పెట్టుకొంది.

కీలక ఆటగాళ్లు: డుసాన్‌ టాడిక్‌, అలెగ్జాండర్‌ మిట్రోవిచ్‌, లుకా జోవిచ్‌; ఫిఫా ర్యాంక్‌: 21; అంచనా: గ్రూప్‌లో రెండో స్థానం.

కామెరూన్‌: ఆఫ్రికా సింహాలుగా పేరొందిన కామెరూన్‌.. స్ఫూర్తిదాయక ఆటకు మారుపేరు. జెయింట్‌ కిల్లర్‌గా మెగా ఈవెంట్‌లో సంచనాలు సృష్టించగల సత్తా ఉన్న జట్టు. అయితే, పాల్గొన్న ఏడుసార్లలో 1990లో మాత్రమే గ్రూప్‌ దశ దాటగలిగింది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే అర్జెంటీనాకు షాకిచ్చింది.

కీలక ఆటగాళ్లు: విన్సెంట్‌ అబోబకర్‌, ఆండ్రే ఒనాన;

ఫిఫా ర్యాంక్‌: 43; అంచనా: గ్రూప్‌లో చివరి స్థానం.

స్విట్జర్లాండ్‌: నిలకడలేమితో కొట్టుమిట్టాడే జట్టు స్విట్జర్లాండ్‌. 2010లో విజేతగా నిలచిన స్పెయిన్‌ను గ్రూప్‌ దశలో ఓడించి సంచలనం సృష్టించినా.. ప్రీక్వార్టర్స్‌ చేరలే కపోయింది. 2018లో బ్రెజిల్‌తో మ్యాచ్‌ డ్రా చేసుకొన్నా.. రౌండ్‌-16లో స్వీడన్‌ చేతిలో ఓడింది.

కీలక ఆటగాళ్లు: అకాంజి, రోడ్రిగ్వెజ్‌, ఎల్విడి, ఎన్‌ సోమ్మర్‌; ఫిఫా ర్యాంక్‌: 15; అంచనా: గ్రూప్‌లో మూడో స్థానం.

గ్రూప్‌-హెచ్‌

గ్రూప్‌-హెచ్‌లోని జట్లపై పెద్దగా అంచనాలు లేకున్నా.. సాకర్‌

ప్రపంచాన్ని ఊపేస్తున్న ప్రఖ్యాత ఆటగాళ్లు రొనాల్డో, సువారెజ్‌ (ఉరుగ్వే), సన్‌ హువాంగ్‌ మిన్‌ (కొరియా) ఉండడంతో.. కొంత

ఆకర్షణ వచ్చింది.

ఉరుగ్వే రెండుస్లారు విజేతగా నిలిచినా.. అది జరిగి ఏడు దశకాలైంది. మొత్తంగా చూసుకొంటే ఈ గ్రూప్‌ నుంచి పోర్చుగల్‌, ఉరుగ్వే నాకౌట్‌ చేరే అవకాశం ఉంది.

ఉరుగ్వే: 1930, 1950ల్లో టైటిల్‌ నెగ్గిన ఉరుగ్వే.. 1970, 2010లో నాలుగో స్థానంలో నిలిచింది. యువత, అనుభవజ్ఞుల కలబోతతో బరిలోకి దిగనుంది. సువారెజ్‌ ప్రధాన ఆటగాడు. వేగమైన పాస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే ఉరుగ్వే.. సెమీస్‌ చేరాలనే పట్టుదలతో ఉంది.

కీలక ఆటగాళ్లు: సువారెజ్‌, కవాని, డార్విన్‌; ఫిఫా ర్యాంక్‌: 14; అంచనా: గ్రూప్‌లో రెండో స్థానం.

పోర్చుగల్‌: స్టార్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డో ఈ జట్టుకు ప్రధాన బలం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, కెరీర్‌ చరమాంకంలో ఉన్న 37 ఏళ్ల రొనాల్డో.. రానున్న తరాలకు స్ఫూర్తిదాయక మార్గదర్శనం చేయాలనుకుంటున్నాడు. ఎంతో ప్రతిభగల మిడ్‌ ఫీల్డర్లు జట్టులో ఉండడంతో.. సునాయాసంగా నాకౌట్‌ చేరే అవకాశాలున్నాయి.

కీలక ఆటగాళ్లు: రొనాల్డో, బెర్నార్డో సిల్వ, బ్రూనో ఫెర్నాండెజ్‌, జొకో ఫెలిక్స్‌; ఫిఫా ర్యాంక్‌: 9; అంచనా: గ్రూప్‌ టాపర్‌.

దక్షిణ కొరియా: వరుసగా 10వసారి బరిలోకి దిగుతోంది దక్షిణ కొరియా. రెండుసార్లే నాకౌట్‌ చేరింది. 2002లో సెమీ్‌సకు దూసుకెళ్లగా.. 2010లో ప్రీక్వార్టర్స్‌లో వెనుదిరిగింది. అయితే, ఆసియా నుంచి బలమైన జట్టుగా బరిలోకి దిగుతుండడంతో జట్టుపై ఎన్నో ఆశలున్నాయి.

కీలక ఆటగాళ్లు: సన్‌ హువాంగ్‌ మిన్‌, కిమ్‌ మిన్‌ జె; ఫిఫా ర్యాంక్‌: 28; అంచనా: గ్రూప్‌లో మూడో స్థానం.

ఘనా..: గ్రూప్‌లో బలహీనమైన జట్టు ఘనా. అదృష్టవశాత్తూ వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కింది. 2010లో త్రుటిలో సెమీస్‌ చాన్స్‌ చేజార్చుకొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న ఘనా.. నాకౌట్‌ చేరితే గొప్పే.

కీలక ఆటగాళ్లు: ఇనాకి, తారిక్‌, రాన్స్‌ ఫోర్డ్‌ ఎబోవా; ఫిఫా ర్యాంక్‌: 61; అంచనా: గ్రూప్‌లో ఆఖరి స్థానం.

Updated Date - 2022-11-15T02:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising